Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా బాలల దినోత్సవం

విశాలాంధ్ర- గూడూరు: గూడూరు మండలంలో పలు పాఠశాలల్లో సోమవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని తుమ్మలపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో
జోహార్ లాల్ నెహ్రూ జయంతిని జరుపుకున్నారు. బాలల దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. మొదటగా హెచ్ ఎం ఉండి. రాణి, పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నెహ్రు చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమం ప్రారంభించి మాట్లాడుతూ బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిపారు. చిన్నారులు జవహర్ లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి ,పూలే ,మహాత్మా గాంధీ, అంబేద్కర్, సరోజినీ నాయుడు , సుభాష్ చంద్రబోస్ వేష దారుణలతో అందరినీ అలరించి ఆకట్టుకున్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోలవరం:

బాలల దినోత్సవం సందర్భంగా పోలవరం ఎం పీ యు పి స్కూల్ నందు బాలబాలికలకు క్రీడ సామాగ్రిని పోలవరం సర్పంచ్ నక్కిన. నాగరాజు, వైస్ ఎం పి పి పిచ్చుక. గంగాధర్ రావు, కన్వీనర్ బుాసం. గిరిజా, స్కూల్ హెచ్ ఎం దోనేపూడి. అన్నపూర్ణ కు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. చాచాకు పిల్లలన్నా, గులాబీలన్నా మహా మక్కువ అని, ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారని విద్యార్థులకు తెలిపారు . అనంతరం ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కప్పలదొడ్డి:
భారతదేశ మొట్టమొదటి ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు కీర్తిశేషులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఎం పి పి ఎస్, జడ్.పి.హెచ్.ఎస్ లలో ఘనంగా జరిగాయి. ప్రజా ప్రతినిధులు హాజరైన విద్యార్థులను అభినందించారు. చదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని సర్పంచ్ యక్కల. మాధవి నాగరాజ్ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img