Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రముఖ కలంకారీ పారిశ్రామికవేత్త ఇక లేరు

విశాలాంధ్ర- గూడూరు : పెడన పట్టణానికి చెందిన ప్రముఖ కలంకారీ పారిశ్రామికవేత్త, తోట మూల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్థల ప్రదాత బట్ట మోహన్‌ రావు(74) సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మోహన్‌ రావు కలంకారీ పరిశ్రమ స్థాపించి వందలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పించారు. కలంకారీ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన మోహన్‌ రావు పదేళ్లపాటు ఉచిత పాలిటెక్నిక్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహించారు. ఆలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారు. పెడన నియోజకవర్గ శాసనసభ్యులు, గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి. రమేష్‌, రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బొడ్డు. వేణుగోపాలరావు, పెడన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బళ్ల. జోత్స్న రాణి, మాజీ చైర్మన్‌ బండారు. ఆనంద్‌ ప్రసాద్‌, మాజీ చైర్‌ పర్సన్‌ బొడ్డు. పద్మజా కుమారి, పుర ప్రముఖులు, కలంకారీ వస్త్ర వ్యాపారులు, చేనేత కార్మికులు, తదితరులు పోలవరం పేట లోని స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img