Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభము

విశాలాంధ్ర- గూడూరు: పెడన నియోజకవర్గం, గూడూరు మండల పరిధిలోని బుధవారం మల్లువోలు, ఆకులమన్నాడు, కప్పలదొడ్డి గ్రామలలో ఉన్నటువంటి సహకార సంఘం బ్యాంక్/ఆర్.బి.కె నందు ఈ ఖరీఫ్ సీజన్ 2022-2023 పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాలు జరిగాయి, ఈ ప్రారంభోత్సవంలో భాగంగా,కప్పలదొడ్డి ఆర్ బి కే చైర్మన్ అందే. రాము ప్రారంభించడం జరిగింది. ఆర్ బి కే సచివాలయ టెక్నికల్ అసిస్టెంట్, తుమ్మల .బ్రహ్మం మరియు సంఘ సెక్రటరీ పిన్నేరి .రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రంలో ధాన్యం తేమను నాణ్యతను పరిశీలించి వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని. ఎకరాకి 82 బస్తాల వరకు తీసుకోబడినని, ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో నేరుగా వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని, రైతుకు రైస్ మిల్లర్లకు ఎటువంటి అనుసంధానం లేకుండా ఆటోమేటిక్ పద్ధతిలో కొనుగోలు కేంద్రం నుంచే మిల్లర్లని ఎంపిక చేయటం జరుగుతుందని ,ఏ దశలోనూ రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకత్వంతో రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా చూస్తామని, చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు .ఈ కార్యక్రమానికి పి ఏ సి ఎస్ అధ్యక్షులు షేక్ ఫైజుల్ రెహమాన్ (మున్నా) కప్పలదొడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు వార్త. రాంబాబు, కప్పలదొడ్డి ఉప -సర్పంచ్, యక్కల. నాగరాజు, పేరిశెట్టి. మధు మరియు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవం ఆర్ బి కే చైర్మన్ అందే రాము

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img