Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు – ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను

విశాలాంధ్ర – జగ్గయ్యపేట: పట్టణంలోని 4వ సచివాలయం 12వ వార్డ్‌ ధనంబోర్డు నందు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ వారికి ఇతర సమస్యలను ఉంటే అడిగి తెలుసుకుని అధికారుల సమక్షంలోనే పరిష్కరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వవిప్‌ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను.ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అని, అవినీతికి అక్రమాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా బటన్‌ నొక్కి డెబిట్‌ ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందజేస్తున్నారని తెలిపారు.దీని ద్వారా రోజుల తరబడి అధికారుల చుట్టూ లబ్ధిదారులు తిరగకుండా పారదర్శకమైన పాలనను అందించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అదేవిధంగా స్థానికులు పలు సమస్యలను నా దృష్టికి తీసుకొని రాగా పైపులైను మరియు బోర్లు మరమ్మత్తులు,డ్రైన్లు ఏర్పాటుకు సంబంధిత అధికారులను తెలిపి,త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అలాగే నిరంతరం వెలుగుతున్న వీధిలైట్లు పరిశీలించడంతో అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యుత్తును వృథా చేయకుండా రాత్రి మాత్రమే వెలిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌,హఫీజున్నిసా ఫిరోజ్‌ ఖాన్‌,పట్టణ యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవానీ ప్రసాద్‌,అనుబంధ విభాగాల అధ్యక్షులు ముసిని రాజ్యలక్ష్మి,బద్దు నాయక్‌,షేక్‌ మొహిద్దిన్‌,ఉప్పెలి అఖిల్‌,మాజీ కౌన్సిలర్‌ మారిశెట్టి కోటేశ్వరరావు,పట్టణ మున్సిపల్‌ కౌన్సిలర్లు,స్థానిక నాయకులు మల్లెంపుడి శివ,రమిశెట్టి అప్పారావు,మల్లె%శీ%పూడి తిరుపతిరావు,గొట్టిపాళ్ల బసవయ్య,కటంరాజు,అరెపల్లి గుణ,షైక్‌ ఆశిఫ్‌,రంగిశెట్టి సాయి,కటరి గోపాల కృష్ణ,శుంకర కేశవ,దారెల్లి రాజు,కనపర్తి నాగేశ్వరరావు,కనపర్తి సత్యం బాబు,షైక్‌ మీరా,వివిధ గ్రామాల ముఖ్య నాయకులు,అధికారులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img