Monday, October 3, 2022
Monday, October 3, 2022

ఘనంగా గణనాధుల నిమజ్జనం

విశాలాంధ్రబ్యూరో`కర్నూలు : నగరంలో గణనాధుల నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి వాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆద్వర్యంలో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాంప్రదాయం ప్రకారం ఆనవాయితీగా మొదట పాతబస్తీలోని రాంబోట్లవారి దేవాలయంలో ఏర్పాటుచేసిన ఘననాధునికి కలెక్టర్‌ పీ కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాంబోట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాధున్ని నిమజ్జనంకు బయలు దేరారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సుమారు 750 విగ్రహాల శోభయాత్ర నిమజ్జనంకు బయలు దేరాయి. గత 8రోజుల నుండి భక్తిశ్రద్దలతో గణనాధునికి పూజలు నిర్వహించిన భక్తులు శనివారం ఆఖరు రోజు నిమజ్జం కార్యక్రమం సందర్భంగా భక్తులకు నిర్వాహకులు భోజనం, అల్పాహారం ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img