Friday, June 2, 2023
Friday, June 2, 2023

ప్రపంచ ఛాంపియన్ గా శ్రీ చైతన్య పాఠశాల

విద్యార్థులను అభినందించిన ఏజీఎం, ప్రిన్సిపాల్

విశాలాంధ్ర-రాజంపేట : అమెరికా నాసా వారి ఎన్ ఎస్ ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో వరుసగా పదవసారి ప్రపంచ ఛాంపియన్ గా శ్రీ చైతన్య పాఠశాల నిలిచి చరిత్ర సృష్టించిందని ఏజీఎం రమణయ్య, ఆర్ ఎస్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఛాంపియన్ గా నిలిచినందుకు గానూ మంగళవారం పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంటెస్ట్ లో ప్రపంచ నలుమూలల నుండి 30 పైగా దేశాలు పాల్గొనగా భారత దేశాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత శ్రీ చైతన్య దేనని అన్నారు. నాసా వారి ఎన్ ఎస్ ఎస్ కాంటెస్ట్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 138 ప్రాజెక్టులలో 89 ప్రాజెక్టులు భారత్ నుంచి ఎంపికవ్వగా అందులో 54 ప్రాజెక్టులు ఒక శ్రీ చైతన్య పాఠశాల నుంచే ఎంపికయ్యాయని తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 18 ప్రాజెక్టులు ఎంపికవ్వగా.. కడప జోన్ నుండి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో బహుమతులు సాధించడంలో గానీ, విన్నింగ్ ప్రాజెక్టుల సంఖ్యలో గానీ, ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యలో గానీ ప్రపంచంలోనే భారతదేశంతో సహా మరే ఇతర దేశాలలోనూ, ఏ విద్యాసంస్థ గానీ శ్రీ చైతన్య శ్రీ చైతన్య సాధించిన ఫలితాలలో సగం ఫలితాలు కూడా సాధించలేదని తెలిపారు. ఇంతటి అనితర సాధ్యమైన విజయానికి కారణమైన విద్యార్థులు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ బి.ఎస్ రావు, డైరెక్టర్ సీమ, ఏ.జి.ఎం రమణయ్య ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, కో ఆర్డినేటర్ కుటుంబరావు, సి బ్యాచ్ ఇన్చార్జి శ్రీనివాసులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img