Friday, May 31, 2024
Friday, May 31, 2024

రబీ సాగుకు గంగ నీరు ఇవ్వాలి.

వెలుగోడు మండల సమావేశంలో ఎంపీపీ
విశాలాంధ్ర`వెలుగోడు : ఎన్టీఆర్‌ జలాశయం ఆయకట్టు కింద గల రైతులు రెండేళ్లుగా రబీ పంటను లైనింగ్‌ పనులతో నష్టపోతున్నారు. ఈ సారి రబీ పంటకు తెలుగు గంగ నీళ్లు ఇవ్వాలని అధికారులను నంద్యాల జిల్లా వెలుగోడు ఎంపీపీ లాలం రమేష్‌ కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు తమ శాఖ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.తెలుగు గంగ ఏ.ఇ. ఇ శివ నాయక్‌ మాట్లాడుతూ, లైనింగ్‌ పనులు 80 శాతం పూర్తి అయ్యాయని , మిగిలిన పనులను 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రెండవ కారు పంటకు ఏప్రిల్‌ నెలాఖరు వరకు నీళ్లు ఇచ్చినా చాలని ఎంపిపి అన్నారు.గ్రామాలలో శానిటేషన్‌ సక్రమంగా చేయక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని , పంచాయతీ సెక్రటరీ లు ఈ విషయంలో శ్రద్ధ చూపి , ప్రతి రోజు ఉదయం ఒక గంట గ్రామంలో శానిటేషన్‌ పై పర్యవేక్షణ చేయాలన్నారు. వ్యాధుల బారిన పడ్డ వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రామ పంచాయతీ వారు చర్యలు తీసుకోని తరలించాలని ఎంపిపి కోరగా, మూగ జీవాలపై చర్యలు చేపడితే బ్లూ క్రాస్‌ వారు కేసులు వేస్తారని , సిబ్బంది కొరత , చేసిన పనులకే నిధులు ఖర్చు అయ్యాయని, కార్యదర్శి హరిలీల సమాధానం అందరికీ వింతగా అనిపించింది. వెలుగోడు నుంచి మిడుతురు మీదుగా గార్గేయపురంకు బస్‌ వేయాలని , విద్యార్థులకు సౌకర్యం గా సాయంత్రం అబ్దుల్లా పురం మీదుగా బస్సులను నడపాలని ఆర్టీసీ వారిని ఎంపిపి కోరారు.ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పని పూర్తి కాలేదని ,మిగిలిన రోజులకు పనులు చూపించాలని కోరారు. జగనన్న కాలనీలకు వెలుగోడు లో ఇసుక డంపు ఏర్పాటు చేశామని హౌసింగ్‌ ఏ.ఇ శ్రీనివాసులు చెప్పగా , వేల్పనూరు లో ఇసుక డంపు ఏర్పాటు చేస్తే , రేగడగూడూరు, వేల్పనూరు గ్రామస్తుల జగనన్న కాలనీల కు ఉపయోగ పడుతుందని సర్పంచ్‌ సర్దార్‌ తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రు లకు వెళ్లకుండా , ప్రజలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చేలా ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించాలని వైద్యాధికారి కృష్ణ మూర్తి తెలపగా, రోగుల పట్ల వైద్య సిబ్బంది రిసివింగ్‌ సరిగాలేక నిర్లక్ష్యంగా చూడటం వల్లే ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల కు చులకన భావం ఉందని ఉపాధ్యక్షుడు చికెన్‌ బాబు విమర్శించారు.వేల్పనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పాత బడి కారుతుందని , నిర్మాణం లో ఉన్న కొత్త భవన%శీ% ఆగిపోయిందని , వైద్య సిబ్బంది కి ఒక భవనం కావాలని వైద్యధి కారి వంశీకృష్ణ అన్నారు. సమావేశానికి ఆర్‌ అండ్‌ బీ, మైనర్‌ ఇర్రిగేషన్‌ , మత్య శాఖ , ఉద్యానవన శాఖ , పోలీసు శాఖ , ఎక్సైజ్‌ శాఖ అధికారులు గెర్హాజర్‌ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అమానుల్లా , సర్పంచ్‌ జైపాల్‌ , ఎం.ఇ.ఓ బ్రహ్మం నాయక్‌ , ఇఓఆర్డీ వెంకట రెడ్డి , విద్యుత్‌ ఏ.ఇ రవీంద్ర నాయక్‌ ఉపాధ్యక్షుడు శంకర్‌ నాయక్‌, సర్పంచ్లు , ఎంపీటీసీ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img