Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆదానీ ఆస్తులను జప్తు చేయాలి : సిపిఐ

విశాలాంధ్ర -ఆస్పరి : ఆదానీ గ్రూప్ కంపెనీల ఆస్తులన్నీ కేంద్ర ప్రభుత్వం జప్తి చేసి, జాతీయం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ముందు పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధ చూప లేదన్నారు. ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ఆదాని ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి మరియు ఎస్బిఐ డబ్బులను షేర్ మార్కెట్లో అప్పనంగా తగిలేసిన ఆదాని పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, తక్షణం ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ అమర్నాథ్ శ్రీనివాసుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఆంజనేయ, బ్రహ్మయ్య, మాజీ ఎంపిటిసి అలిగేరప్ప, శివన్న, బడే సాబ్, రంగన్న, రామచంద్ర, ఎర్రిస్వామి, రంగస్వామి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్, సురేష్, మల్లికార్జున, ఏఐఎస్ఎఫ్ రేవేన్, కుమార్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img