Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఇంటింటి రీసర్వే త్వరితగతిన పూర్తిచేయాలి

విశాలాంధ్ర`పెద్దకడబూరు : ఇంటింటి రీసర్వే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని డివిజనల్‌ పంచాయతీ అధికారిణి నూర్జహాన్‌ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం నందు ఎంపీడీవో వెంకట రమణప్ప ఆధ్వర్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు జగనన్న భూ హక్కు, భూ రక్ఱ కార్యక్రమంలో భాగంగా డివిజనల్‌ పంచాయతీ అధికారిణి నూర్జహాన్‌ పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు, గ్రామ సర్వేయర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఏవిధంగా ఇళ్ల స్థలాలు మరియు ఖాళీగా ఉన్న స్థలాలు కొలతలు తీయాలి, ఏవిధంగా కంప్యూటర్‌ లో అప్‌ లోడ్‌ చెయ్యాలో వివరించారు. దీంతో ప్రభుత్వం యజమానులకు శాశ్వత భూ హక్కు పత్రాలు, ఇంటి పత్రాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున గ్రామాల్లోని ఇళ్ల స్థలాలు, ఖాళీగా ఉన్న స్థలాల కొలతలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఓఎస్‌ త్యాగరాజు, డిఐఓఎస్‌ వేణుసూర్య,పంచాయతీ రాజ్‌ శాఖ ఏఈ మల్లయ్య, మండల సర్వేయర్‌, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img