Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మండల టాపర్ గా జితేందర్ సింగ్ (586)

విశాలాంధ్ర- ఆస్పరి : 10వ తరగతి ఫలితాలలో స్థానిక విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో చదువుతున్న జితేందర్ సింగ్ అను విద్యార్థి అత్యధికంగా 586 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు. మండలంలో విజేత ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ హై స్కూల్ 93.62శాతంతో మొదటి స్థానంలో నిలువగా, తంగారడోన జడ్పీ హైస్కూల్ 21.74 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. వివిధ పాఠశాలల వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్పరి జడ్పీ హైస్కూల్ 40.74 శాతం, జొహరాపురం జడ్పీహెచ్ స్కూల్ 52 శాతం, చిన్న హోతూరు జడ్పీ హైస్కూల్ 53.13 శాతం, నగరూరు జడ్పీ హైస్కూల్ 51.12 శాతం, కారుమంచి జడ్పీ హైస్కూల్ 69.70 శాతం, బిల్లేకల్లు జడ్పీ హైస్కూల్ 33.33 శాతం, కైరిప్పుల జడ్పీ హైస్కూల్ 66.67 శాతం, ములుగుందం జడ్పీ హైస్కూల్ 41.94 శాతం, అలాగే ఆస్పరి కేజీబీవీ 62.57 శాతం, ఏపీ మోడల్ స్కూల్ 65.59 శాతంగా ఉత్తీర్ణత సాధించాయి. పది ఫలితాలలో మండలం మొత్తం మీద 57 శాతం నమోదైనట్లు ఎంఈఓ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

పది ఫలితాలలో విజేత ప్రభంజనం….

నేడు ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి ఉత్తీర్ణత ఫలితాలలో విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రభంజనం సృష్టించినట్లు స్కూల్ కరస్పాండెంట్ మల్లేష్, ప్రిన్సిపాల్ ధనలక్ష్మిలు తెలిపారు. శనివారం స్థానిక హైస్కూల్ ఆవరణంలో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ మల్లేష్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో మా హైస్కూల్ నుండి ఆర్.పి జితేందర్ సింగ్ 586 మార్కులతో మండల టాపర్ గా ప్రథమ స్థానంలో నిలవగా.. హసీనా 535, షారుఖ్ 533, వైష్ణవి 523, విజయ్ కుమార్ 511, కావేరి 508, రాధిక 503 మార్కులు సాధించారని అన్నారు. అలాగే 34 మంది విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని తెలిపారు. ఇంగ్లీష్, లెక్కలు, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో 100/100 మార్కులు కూడా ఎక్కువ మంది సాధించారని తెలిపారు. ఈ స్థాయిలో విజయాలు సాధించడంలో ఉపాధ్యాయులు ఉన్నత స్థాయి బోధన, విద్యార్థుల కృషి,తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img