Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శాసనమండలి రద్దు అన్నవాడికి ఓటు అడిగే హక్కు లేదు

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మేధావులు ఉండే పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు లేదని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని కంబదహాల్, బసలదొడ్డి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తిక్కన్న, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు నాగిరెడ్డి, దాసు, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు వెంకటేష్ లతో కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రాజకీయ నిరుద్యోగలకు అవకాశాలు కోసమే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఇలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం పోటీ చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దొంగ ఓట్లతో గెలవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలిచేది ప్రజాస్వామ్యమే అన్నారు. కావున ఉద్యోగులు, నిరుద్యోగలు ఐక్యంగా అధికార పార్టీని ఓడించి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img