Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఏపీజీబీ బిజినెస్ కరస్పాండెంట్ పై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల పరిధిలోనే ముత్తుకూరు గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ సెంటర్ మసుగులో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బీసీ పాయింట్ కరస్పాండెంట్ శివ శంకర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు దగ్గర ఏపీజీబీ బ్యాంకు ఖాతాదారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకులు లేని చోట మరియు అండర్ బ్యాంక్డ్ ఏరియాల్లోని కస్టమర్‌లకు ఆర్థిక మరియు బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు ఆయా బ్యాంకులు గ్రామాల్లో బీసీ పాయింట్లను నెలకొల్పడం జరిగిందన్నారు. అయితే ముత్తుకూరు గ్రామంలో బిజినెస్ కరస్పాండెంట్ గా పని చేస్తున్న శివశంకర్ రెడ్డి బ్యాంకు కస్టమర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి వారి బ్యాంకు ఖాతాల్లో నిలువ ఉన్న సొమ్మును దోచుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ బ్యాంకులకు చెడ్డి పేరు తీసుకున్నారని ఆరోపించారు. ముత్తుకూరు గ్రామానికి చెందిన ఉప్పర చంద్ర తన అవసరం నిమిత్తం బిసి పాయింట్ కి వెళ్లి తన బ్యాంకు ఖాతా నుండి రూ.3000 డ్రా చేయమని అడగగా రెండుసార్లు తన ఫింగర్ ప్రింట్ ను పెట్టి రూ. 6000 డ్రా చేసుకునే రూ. 3000 మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామంలో చదువురాని అమాయకులను ఆసరాగా చేసుకుని ఇలాంటి అవినీతి అక్రమాలు కోకోలోలకు పాల్పడ్డాడని విమర్శించారు. ముత్తుకూరు గ్రామంలో ఉన్న ఏపీజీబీ బ్యాంక్ ఖాతాదారుల క్రెడిట్, డిపాజిట్ వివరాలు సేకరించి బ్యాంక్ బీసీ పాయింట్ కరస్పాండెంట్ శివ శంకర్ రెడ్డి చేతిలో మోసపోయిన వారికి నగదు చెల్లించి న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాదారులను, రైతులు, యువతను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం బ్యాంకు మేనేజర్ కు, అలాగే సీఐ హనుమంతప్ప కు వేరువేరుగా వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐవైఎఫ్ నాయకులు హనుమంతప్ప, చంద్ర, రాఘవేంద్ర, బ్రహ్మయ్య, ఉరుకుందప్ప, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img