Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేటి యువత పోరాడాలి

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : విప్లవవీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ భగత్‌ సింగ్‌ 93వ వర్దంతి వేడుకలను ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సిపిఐ కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ చదువుతున్న రోజుల్లోనే జులియన్‌వాలాబాగ్‌ దుర్ఘటనతో చలించిపోయారని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం 23 సంవత్సరాలకే ప్రాణత్యాగం చేసి ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేటి యువత పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు భాస్కర్, నజీర్, రాజు, నవీన్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img