అంగన్వాడీ కేంద్రానికి తాగునీటి వసతి కల్పించిన గ్రామ సర్పంచ్ రామాంజనేయులు
విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం ప్రక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రం బి2 నందు చిన్నారులకు గ్రామ సర్పంచ్ రామాంజనేయులు తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రామాంజనేయులు మంగళవారం అంగన్వాడీ కేంద్రంలో మంచి నీటి కొళాయిని సర్పంచ్ ప్రారంభించారు. చిన్నారులకు తాగునీటి సమస్య తీర్చించినందుకు అంగన్వాడీ కార్యకర్త థెరీసమ్మ, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ, సర్పంచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.