Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట, మేకడోన, కంబలదిన్నె, జాలవాడి, హెచ్ మురవణి, కంబదహాల్, బసలదొడ్డి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను ఆయా చర్చిలలో క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో సి ఎస్ ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ ముత్తు మనోహర్ బాబు, ఆర్సీఎం చర్చి ఫాదర్ సంజీవరావు ఆధ్వర్యంలో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా ఉదయం సి ఎస్ ఐ యూత్ కమిటీ సహకారంతో గ్రామ పురవీదుల గుండా సిలువ యాత్ర నిర్వహించి, బస్టాండ్ ఆవరణంలో సిలువ యాత్ర నాటికలో క్రీస్తు, ఆయన శిష్యులు, యూదారాజు, సైనిక పాత్రలు చూపరులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఏసుక్రీస్తు సిలువలో పడిన శ్రమలను కళ్లకు కట్టినట్లు చూపించి అందరినీ కంటతడి పెట్టించింది. అనంతరం మద్యాహ్న 3గంటల వరకు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మానవాళి లోకపాపముల నిమిత్తం యేసుక్రీస్తు కల్వరి సిలువలో బలియాగమయ్యారన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల ఎడల ప్రేమ, జాలి, దయ కలిగి ఉండి క్రీస్తు అడుగు జాడలలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయా చర్చిల సంఘ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img