Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

జీవన కవితా తరంగాలు

కాలం ఎవరి కోసం ఆగదు…కాలంతో పాటు మనం మారి మనతో పాటు సమాజాన్ని మార్చగలగాలి. ఇది చెప్పినంత సులభం కాదు. ఆచరణలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. ఇలా తన జీవిత అనుభవాన్ని రంగరించి కూర్చిన వచన కవితా తరంగం ‘కాలంతో పాటు’. కవి ఎస్‌.ఎం.సుభాని. కాలంతోపాటు కవితా సంపుటిలో అనేక అంశాలను స్పృశించారు. వాటిని తనదైన శైలిలో కవి విశదీకరించారు. ఇందులో కొన్ని కవితలు తెలంగాణా ఉద్యమ సమయంలో రాసినవి కావటం విశేషం.
ఇందులో ప్రేమించు కవితలో ‘‘జీవితాన్ని ప్రేమించు ఒకసారి/ నీలోకి… నీవు పయనించు/ జ్ఞాన జ్యోతిని వెలిగించు/ పరిపూర్ణతను సాధించు అంటూ సందేశాత్మకంగా ఉంది. అలాగే ‘‘లోపలి మనిషి’’ అనే కవితలో కాలం అలాగే ఉన్నా మనిషి ఆలోచనలుమనిషిలో మార్పులు ఎలా ఉంటాయి అని తెలిపే కవిత. ఇందులో కవిత చివరిగా చెప్పిన మాటలు మానవత్వం ముసుగులో/ మృగంలా చరించే/ లోపలి మనిషిని నేను/ ఎప్పటికీ మారనిది నా నైజం అంటూ మనిషి నైజాన్ని చక్కగా వివరించారు. మరో కవిత చరమాంకానికి చిరునామా…జీవిత చరమాంకం అనేది మనిషికి తధ్యం అది ఎలా అయినా అయి ఉండవచ్చు. కాని కవి తన కోణంలో రాసిన కవిత ఇది. ఇందులో నలిగిపోయి చినిగిపోయి/ రంగు వెలిసిన నాటి అపురూప చిత్రం/ దర్పం కోల్పోయి దిగులుగా/ గోడకు వేలాడుతూ/ నే చూసినప్పుడల్లా నన్ను చూసి/ చిత్రంగా నవ్వుతుంది/ చరమాంకానికి చిరునామాలా అంటూ ముగుస్తుంది. ఇంకా ఇందులో ఏమో! ఒంటరిగా భయమేస్తోంది వంటి అనేక కవితలు చదవాల్సిందే.
విష్ణుభొట్ల రామకృష్ణ, సెల్‌: 9440618122

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img