Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రావి శాస్త్రి రచనలు అజరామరం

డా॥ శిఖామణి, 9848202526

‘‘రచయిత అయిన ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను తలుస్తాను’’ అని రచయిత మంచి వైపు నిలబడవలసిన అవసరాన్ని గుర్తు చేయడమే కాకుండా తాను మంచి వైపు నిలబడ్డ మహారచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి. రావిశాస్త్రి 30 జులై 1922 న జన్మించారు. ఇది ఆయన శతజయంతి సంవత్సరం. ముందుగా ఆ మహారచయితకు శత జయంతి నివాళులు.

అల్పజీవి, రాజుమహిషి, రత్తాలురాంబాబు, సొమ్మలు పోనాయండి, ఇల్లు వంటి నవలలు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, ఆరు సారా కథలు, మూడు కథల బంగారం, ఋక్కులు, బాకీ కథలు వంటి కథా సంపుటాలు వెలువరించారు. తన రచనల్లో ఉత్తరాంధ్ర జిల్లాల జీవమైన మాండలిక భాషను అత్యంత సహజంగానూ, అలవోకగాను ప్రవేశపెట్టి వాటికి జవమూ జీవమూతో పాటు కళా ఖండాలనదగిన శాశ్వతత్వాన్ని చేకూర్చి పెట్టారు. రావిశాస్త్రి రచనల్లోని కవితాత్మక శైలిని పట్టి చూడడం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
అసలు ఒక రచయిత రాసే రచనలో, ముఖ్యంగా కథ, నవల, వ్యాసం వంటి రచనలో కవితాత్మక వచనం, లేదా కవితాత్మక శైలి చోటు చేసుకోవడానికి కారణాలేమై ఉంటాయి అని ప్రశ్నించుకున్నపుడు దొరికే మొట్ట మొదటి సమాధానం అతడు భావుకుడు కనక. భావుకత్వం లేనిదే ఒక రచయిత ఎట్లా అవుతాడు అని వెంటనే మరొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. దానికి సమాధానం మామూలు భావుకత్వం కంటే, ఉదాత్తమైన భావుకత్వం కలిగిన వాడై వుండాలి, లేదా మౌలికంగా ప్రాథమికంగా అతనకవైనా అయుండాలని మరొక సమాధానం. ఇటువంటి సందర్భాల్లో ఆయా రచయితల నేపధ్యాల్లోకి, మూలాల్లోకి తొంగిచూస్తే ఈ కవితాత్మక శైలిలో రాయడానికి కారణాలు కొన్నయినా దొరుకుతాయి, తెలుస్తాయి. తెలుగులో చలం, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, తిలక్‌, నండూరి రామ మోహనరావు వంటి రచయితలు మొదట కవిత్వ రచనతో సాహిత్య ఆరంగ్రేటం చేసి, అటు తర్వాత వచన రచన వైపు మళ్ళారు. తిలక్‌ లాంటి కొందరు అటు కవిత్వాన్ని ఇటు వచనాన్ని సమపాళ్ళలో నడిపిన వారూ ఉన్నారు. కాల్పనికోద్యమంలో రచయితగా కాలూనిన చలం బ్రహ్మ సమాజ ఉద్యమ ప్రచారంలో భాగంగా అద్భుతమైన గేయ సాహిత్యాన్ని సృజించారు. బైబిలు, గీతాంజలి వంటి గ్రంథాలను గొప్ప కవితాత్మ ప్రతిఫలించేలా అనువదించారు. తర్వాతి కాలంలో ‘యశోద గీతాలు’ వంటి ఆధ్యాత్మిక, మార్మిక కవిత్వ రచనలూ చేసారు. పడవ ప్రయాణం కథతో తెలుగు కథకు అంతర్జాతీయ కీర్తిని ఆర్జించిన పాలగుమ్మి పద్మరాజు కవిత్వం ఆరోజుల్లోనే గ్రంథ రూపంలో వచ్చింది. అన్వేషిస్తే ఇలాంటి రచయితలు మరికొందరు బయటపడతారు. ఇదంతా ఎందుకంటే మౌళికంగా కవి అయిన వాడు, ఉదాత్త భావుకత్వం ఉన్నవాడు రాసిన రచనలో కవితాత్మక వచనం అప్రయత్నంగా వచ్చి కూచుంటుంది అని చెప్పడానికే!
చలం కవిత్వానికి వజీర్‌ రహ్మన్‌ చేసిన ఉపకారం లాంటిదే రావిశాస్త్రి కవిత్వానికి త్రిపురనేని శ్రీనివాస్‌ చేసాడు. తన కవిత్వం ప్రచురణలు పరంపరలో 10వ పుస్తకంగా రావిశాస్త్రి కవిత్వం ఎన్నెలో ఎన్నెల పేరుతో 1991 జనవరిలో పుస్తకంగా తెచ్చాడు. ఈ ప్రసంగ పాఠానికి ఎన్నెలో ఎన్నెల, తెలుగు వచన శైలి గ్రంథాలు ప్రధాన ఆకారాలు. అయితే చలం లాగే రావిశాస్త్రి కూడా తాను కవిత్వం రాద్దామని ప్రయత్నించి విఫలమైనట్టు ఒక ఇంటర్‌వ్యూలో చెప్పుకున్నాడు. ఁI aఎ a టaఱశ్రీవస జూశీవ్‌. మొదట నాకు పోయిట్రీ రాద్దామనే సరదా ఉండేది గానీ రాయలేకపోయాను. చిన్నప్పుడు సంస్క ృతం నేర్చుకున్నాను. దానితో తెలుగు రాలేదు. సంస్క ృతం కూడా రాలేదు. తెలుగులో బాగా ప్రవేశం లేకపోవడం చేత కవిత్వం రాయలేక పోయాను’’ (1631988, ఉదయం దిన పత్రిక, ధ్వని పేజీ) అయితే ఎన్నెలో ఎన్నెల సంపాదకుడు త్రిపురనేని శ్రీనివాస్‌ తన ముందుమాటలో ‘‘అప్పట్లో వచనం పేరుతో రావిశాస్త్రి రాసింది ఈ నాటి అత్యాధునిక కవిత్వంలో పోటీపడ గలుగుతోంది అంటే ముప్ఫై నలభై ఏళ్ళ క్రితమే ఆయన సాధించినదేమిటో అర్థం అవుతుంది.’ అని రాసిన మాటలో నూటికి నూరు శాతం నిజం. కవులు రచయితలకు చాలామందికి నోట్సు రాసుకునే అలవాటు ఉంటుంది. సద్యోస్ఫూర్తిగా అప్పటికప్పుడు స్ఫురించిన ఒక వాక్యాన్నో, కవితా శకలాన్నే వెంటనే కాగితంమీద నోట్‌ చేసుకుంటారు. మన వాక్యమే కదా, తర్వాత గుర్తు చేసుకుందామంటే ఎంత తల బద్దలుకొట్టుకున్నా గుర్తుకు రాదు. అందుకే మా మాస్టారు అత్తలూరి నరసింహారావు వాక్యం పలికితే భార్య పక్కలో పడుకున్నా, వెంటనే లేచి రాసిపెట్టుకోవాలి, లేకపోతే పొద్దున ఎంత తన్నుకు వచ్చినా గుర్తుకు రాదు’’ అని తనదైన ధోరణిలో చెప్పేవారు. ఇలాంటి అనుభవం ప్రతీ కవీ, రచయితా ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. రావిశాస్త్రి అలా నోట్సులు రాసిపెట్టుకోవడం వల్ల ఆయన సాహిత్యంపై వచ్చిన విమర్శలకు సమాధానాలు నోట్సుల్లో ఉన్నాయని యు.ఎం. నరసింహమూర్తి పేర్కొన్నారు. రావిశాస్త్రి కవితాత్మక శైలిని పరామర్శించే ముందు విమర్శకులు ఆయన రచనా విధానంపై చేసిన విమర్శలకు ఆయన నోట్సుల రూపంలో ఇచ్చుకున్న వివరణలను చూద్దాం. రావిశాస్త్రి కథలు రాసేటపుడు శిల్పంగురించి అవసరం కంటే ఎక్కువ శ్రద్ధతీసుకుంటారని ఒక విమర్శ. దానికి శాస్త్రి ‘‘వాస్తవానికి నేను కథగా చెప్పే ఇతివృత్తం ఏ విధంగా చెప్తే బాగుంటుందోనని కొంచెం ఆలోచిస్తాను. కానీ దాని గురించి తన్నుకు చావను. ఆ విధానం తెలిస్తే ఆ కథ సరిగా వస్తుంది.’’ అలాగే దృక్పథంగురించి చక్కగా చెప్పటం ఒక్కటే ప్రధానం కాదు. చక్కగా నువ్వేం చెబుతున్నావు అనేది ముఖ్యం. రచయితకు దృక్పథం ముఖ్యం అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అలాగే ఆయనకు విని నేర్చుకోవడం ఇష్టం ఆయన రాసుకున్న నోట్సులో చిట్టి పంతులు మాటలుగా రాసి పెట్టుకున్న ‘‘నువ్వు చదువుకి సముద్రానివి, అనుభవానికి కాల్వవి. నేను చదువుకి కాల్వను. అనుభవానికి సముద్రాన్ని’’ వంటి జీవతానుభవపు మాటల్ని ఆయన లోకం వినికిడి నుంచి గ్రహించినట్టే భావించ వచ్చు. ‘‘ప్రాథమిక రచనలలో శైలీ స్పృహ లేదు. అల్పజీవితో పేరు వచ్చిన దగ్గరనుండి శైలీ స్పృహ వచ్చింది అని ఒకచోట రానుకున్నారు. రావిశాస్త్రి శైలిలో కొంత చైతన్య స్రవంతి, అధివాస్తవిక శైలులు ఉన్నట్టు విమర్శకులు గుర్తించారు. ఒక రచయిత రచనా విధానం మీద శిల్పం మీదా అతను చేసే వృత్తి, ఆ వృత్తిలో ఎదురయిన మనుషులు, వారి భాష, యాస, కట్టూ బొట్టూ, ప్రవర్తన వంటి విషయాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో రావిశాస్త్రి జీవితమే ఒక ఉదాహరణ. సంపన్న బ్రాహ్మణ వర్గంలో పుట్టిన విద్యావంతుడు, న్యాయవాది అయిన ఒక రచయితకు అట్టడుగు పొరల్లో జీవిస్తున్న అలగా జనం (నా మాట కాదు) భాష ఎలా వంటబట్టిందో ఆయన మాటల్లోనే వినండి. ‘‘న్యాయవాద వృత్తిలో నా దగ్గరకు వచ్చే బీదప్రజలతో సాన్నిహిత్యం వల్ల వారి ప్రవర్తన, భాష బాగా పరిశీలించి నాకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నాను. అది విశాఖ మాండలికం అనుకోండి, ఉత్తరాంధ్ర భాష అనుకోండి, మరోటనుకోండి’’ ఇది రావిశాస్త్రి రచనా శైలికి ఉన్న నేపధ్యం అందుకే ఆయన తన క్లయింట్స్‌కు అభిమాన పూర్వకమైన ‘ఛాత్రిబాబు’ అయ్యారు. ఆయన రచనల్లో సజీవ పాత్రలై మిగిలిపోయారు. ఈ మొత్తం వ్యవహారం, కేవలం ఆయన రచనా శైలిమీదనే కాక, కవిత్వ శైలిని కూడా ప్రభావితం చేసాయనడానికి, ఆయా పాత్రల వర్ణనలు మనకు సాక్షంగా నిలుస్తాయి. రావిశాస్త్రి రచనల్లో కవితాత్మక శైలి గురించి మాట్లాడుకునే ముందు శైలి గురించి ఒకటి రెండు మాటలు. శైలి శీల సంబంధమైనదని ప్రాచీన అలంకారికులు భావించారు. శీలం శబ్దంనుండి శైలి ఏర్పడిరదని ఒక భావన. ‘శీలస్వభావః శీలస్యకర్మశైలి’ అని సంస్క ృత నిఘంటువులు. సాహిత్యంలో రసము, తులనాత్మక అధ్యయనం వంటి మౌలిక భావనలు ముందుగా ఆయుర్వేదం, పైథాలజీ అండ్‌ రిలిజియన్‌ వంటి సాహిత్యేతర శాస్త్రాలలో ప్రచారం పొందాక సాహిత్యంలో ప్రవేశించాయి. శైలి భారతీయ అలంకార శాస్త్రంలో ‘రీతి’ వంటి వాటికి దగ్గరగా ఉన్నా ఆధునిక యుగంలో అది భాషా శాస్త్రంలోనే ముందుగా ర్‌వశ్రీఱర్‌ఱషం పేరుతో ప్రధాన అంశంగా వృద్ధి చెందింది. ఆ తరువాతే అది సాహిత్య విమర్శలో ‘శైలి’గా స్థానం సంపాదించుకొంది. అయితే శైలి గురించి తెలుగులో విశేష కృషి చేసిన చేకూరి రామారావు, పరిమి రామ నరసింహం వంటివారు వెలువరించిన గ్రంథాలు భాషాశాస్త్ర నేపథ్యంలో వెలువడినవే అని గమనించాలి. తెలుగులో సాహిత్యంలో ఆ లోటును చాలావరకు తీరుస్తూ వచ్చిన బృహద్గ్రంధం డా॥ యు.ఎ.నరసింహమూర్తి తెలుగు వచన శైలి గ్రంథం. తెలుగు శైలికి సమానార్ధకంగా ఇంగ్లీషులో ర్‌వశ్రీవ అనే పదం విస్తృతంగా వాడుకలో వుంది. ఖa్‌ఱవ షaశ్రీవం అనే శైలీశాస్త్ర నిఘంటుకారుడు తన ఁA సఱష్‌ఱశీఅaతీవ శీట ర్‌వశ్రీఱర్‌ఱషంఁ అనే గ్రంథంలో ఒక వ్యక్తి ఆచరించే చర్య, సన్నివేశం, సంభాషణలు, వాచకం, మొదలైన ఏడు పద్ధతులలో రచయితకు శైలి ఏర్పడుతుందని చెప్పాడు. ఇవి సాధారణ శైలితోపాటు కవితాత్మక శైలికి కూడా దోహదం చేస్తాయని రావిశాస్త్రి రచనానుభవం మనకు చెబుతుంది. ‘‘ఒక శిల్పానికి జీవాన్ని తెచ్చేది ఆ శిల్ప పనితనం. అతని చేతిలోని మార్దవం తాను చెప్పినట్టుగా రాయి తన మాట వినడం, తాను తలచిన రీతికి రాయి ఒదగడం. మహా శిల్పిచే నిర్వహించబడిన కావ్యం కూడా అంతే. ఆ కవి పనితనం ఎక్కడో గోచరిస్తే అక్కడ శిల్పం ఉన్నదని మనం అనుకోవాలి’’ అంటారు వడలి మందేశ్వర్రావు. ‘‘వస్తువును వ్యక్తీకరించే విధానం శిల్పం. అని నందిని సిధా రెడ్డి అభిప్రాయం. చలం తన రచనల వస్తువును వదిలేసి శైలిని మెచ్చుకున్న సందర్భంలో’’ వాళ్ళు శైలి అనుకునేది నా హృదయోద్రేకం అన్నారు. మామూలు శైలితో పాటు కవితాత్మక శైలికి ఈ హృదయోద్రేకం అవసరం అని రావిశాస్త్రి కవితా వాక్యాలు చెప్తాయి. ఈ కవితాత్మకత పాత్రల అంతరంగపు ఉద్వేగాల ద్వారా, పువ్వులు, వెన్నెల, రాత్రి వంటి ప్రకృతిని వర్ణించే విధానంలోనూ, పాత్రలు పడే సంఘర్షణ్ల ద్వారా ఇలా అనేక రకాలుగా కనిపిస్తుంది. మూడు కథల బంగారం’ నవలలో తెల్లచీర కట్టుకుని వెన్నెలలో నిలుచున్న వియత్నాం విమలను చూసినప్పుడు బంగారయ్యలో కలిగిన భావావేశం చూడండి. ‘‘చంద్రుడు, నీలాల చెరువులో బంగారు పడవలా వెలుగుతున్నాడు / చుక్కలు, ఎండవేళ నీట్లో తేలే తెల్ల గులాబీల్లా మెరుస్తున్నాయి. గాలి / వేసవి కాలంలో మంచినీటి చెంబుకి చెంప ఆన్చుకుంటే హాయి అన్పించినట్టు హాయిగా తగుల్తోంది’’ ఇలా ప్రకృతిని తనదైన శైలిలో వర్ణిస్తూ ఆ వెన్నెల రాత్రి విమల చూన్తున్న అనుభూతిని గాలి ఎక్కడెక్కడ నించో తెచ్చే గంధం/ విమలనించి వీచే గంధం/ నాలోంచి ఎగసేగంధం/గంధం గంధం/ గంధాల గంధపు వాసనలతో నేను వేడెక్కి పోతున్నాను, మత్తెక్కిపోతున్నాను. ఇలా చివరివాక్యాల దగ్గరకు వచ్చేసరికి బంగారయ్య పొందిన భావోద్వేగం పాఠకునికి అనుభూతమౌతుంది. కవితాత్మకశైలి ప్రయోజనం ఇదీ! ఇదే కథలో విమల మామూలు దుస్తులు విడిచి నర్సు దుస్తులు మార్చుకుంటున్నపుడు ఆమెను అర్ధనగ్నంగా చూసిన బంగారయ్య ఫక్తు భావకవిలా మారిపోయి ఆమె అందాన్ని’’ ఆహా! అందరూ.... నువ్వు శరత్కాలపు చల్లచల్లని పూర్ణ చంద్రుని రేఖవే! నువ్వు మాఘ మాసపు ఉదయకాలపు సూర్య కిరణపు శోభవే! నువ్వు వేయి రాత్రుల నీలివెన్నెల మంచుసోనల జల్లువే అందమా! అందమా! నువ్వు చీకటికి కాంతినిచ్చే కంటి కాటుక రేఖవే! ఇలా సాగుతుంది విమల అందపు వర్ణన. ఇటువంటి చోట్ల ఆ పాత్రలోంచి రచయిత తొంగిచూడ్డం పాఠకుడు గమనించకపోడు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలకు మొక్కలు నాటడం, పెంచడం ఇష్టం. ఈ వ్యాసకర్తకు చిన్నప్పుడు ఈ రోజు పెరట్లో విత్తనాలు నాటి మరుసటి రోజు ఉదయమే లేచి వెళ్ళిచూసి, ఇంకా మొక్కలు రాలేదని నిట్టూర్చిన అనుభవం ఉంది. ఆరు సారో కథలు సంపుటంలోని ‘పువ్వులు’ కథలో కమల కూడా అటువంటిదే. పదమూడేళ్ళ కమల అంతకు ముందు రోజు సాయంత్రం పెరట్లో బంతి మొక్కలు నాటి మరునాడు పొద్దున్నే వాటిని చూసిన ఆనందం, ఆశ్చర్యాలను రావిశాస్త్రి ఇలా ఒడిసిపట్టుకున్నారు. ‘‘ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల /అటు ఆ మొక్క దగ్గరకు పరుగెట్టింది కమల/ ఇదే కమల ఈ మొక్క అయింది/ ఇదే కమల ఆ మొక్క అయింది/ నిన్నరాత్రి నీటిమబ్బు ఈ కమలే/ నిన్నరాత్రి వానజల్లూ ఈ కమలే/ ఆ కమలే ఈ ఉదయం సూర్యరశ్మిగా మెరుస్తుంది.’’ అని కమలను తలెత్తి నిలుచున్న బంతి మొక్కలకు అబేధం చెప్పి, ఒక తాదాత్మ్య స్థితిలోకి రచయిత తీసుకెళ్తారు. మూడు కథల బంగారం నవలలో మెయిల్‌లో తిరుపతి పెళ్ళికి వెళ్తున్న గొప్పింటి అమ్మాయిలను మోసపుచ్చి సజ్జను ఎత్తుకుపోయిన దొంగ బంగారిగాడు సజ్జలో అడుగునున్న బంగారాన్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయి అన్న మాటలు...’’ సజ్జల ఏటుందనుకున్నారు? బంగారం! బంగారం!....సుట్లు సుట్టుకొని పావులు పావులుగావుంది రంగురంగు లతల్లా తీగెలు తీగెలుగా ఉంది. ఆడోళ్ల గుండెల్లాగ్గ బరూబరూగ్గ ఉంది పొదలంట పులికళ్ళు దాగున్నట్టు ఆ బంగారమంతా ఆ సజ్జలో మాటేసుకు కూకుంది.’’ అయి దొందలో ఆరొందలో తులాలుంటే అంతబంగారాన్ని బంగారిగాడు ఎప్పుడూ కంటితో చూడలేదు. అందుగురించి అతనికి బంగారం అనేక విధాలుగా గోచరిస్తుంది. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఏదైనా వర్ణన చేసేటప్పుడు స్త్రీని తీసుకురావడం అదికూడా శృంగారపరంగా. రెండు, బంగారి గాడికి సజ్జలో బంగారంపైనే దొరకలేదు. పై సున్నుండలు, ఆకింద తువ్వాలు, తువ్వాలు కింద బంగారం కనబడిరది. అందుకే పొదలంట పులికళ్ళు దాగున్నట్టు బంగారం మాటేసింది అనడం సాభిప్రాయ వర్ణన. ఋక్కులు కథల సంపుటిలో తలుపుగొళ్ళెం కథలో పైడిరాజు షావుకారు గదిని చూసినప్పుడు, చిన్నప్పుడు తన ఇంట్లోని ఇరుకుగదితో పోల్చుకున్నప్పుడు రెండుగదుల మధ్య వ్యత్యాసాన్ని కవి ఇలా బొమ్మ కట్టించాడు. ‘‘ఓ గదినిండా నీడలే రెండో గదినిండా పాలవెలుగులే ఓగదిలో మూలుగులే రెండో గదిలో నవ్వులే. అందులో మనిషి కష్టం కళ్ళు విప్పుకుని చీకటిగా ఏడుస్తోంది. ఈ గదిలో మనిషి దొంగతనం వెలుగుతోంది... ఆ గదిలో నిర్భాగ్యుల నీడలు. ఈ గదిలో దొంగతనపు రంగులు’’ కథాభాగం నుండి విడదీసి విడిగా ఈ పంక్తులను చదువుకుంటే మంచి అభ్యదయ కవిత అనిపిస్తుంది ప్రజల్ని దోచుకున్న షావుకారు గదికి, పేదవాడైన పైడ్రాజు గదికి వ్యత్యాసాన్ని చూపించడానికి రచయిత వాడిన పోలికలు, ప్రతీకలూ ధనవంతుడినీ పేదవాడికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతాయి. ఈ పంక్తుల్లో వచ్చిన ‘‘దొంగతనం వెలుగుతోంది’’ మనిషి చేసే దొంగతనం, దొంగతనపు రంగులు’’ షావుకారు చేసే దోపిడీని తెలియచెప్పే పదాలు రచయితకు దృక్పథం ముఖ్యం అని నమ్మిన రావిశాస్త్రి ఇలాంటి తావుల్లో తన దృక్పధాన్ని చెప్పకనే చెప్పాడు. ‘బాకీ కథలు’ సంపుటిలో ‘వెన్నెల’ కథలో రావిశాస్త్రి వెన్నెలను వర్ణించిన పద్ధతి అపురూపం. చాలా కవితాత్మక రచనల్లో కేవలం వర్ణన మాత్రమే ఉంటే ఈ కథలో చేసిన వెన్నెల వర్ణనతో పాటు శ్రామికుల పోరాటం కూడా సమాంతరంగా నడుస్తుంది. ఈ రచన చదివాక రావిశాస్త్రి కార్మికుల పక్షాన నిలబడిన వర్గ పోరాట రచయితగా కనిపిస్తారు.’’ వెన్నెలా వెన్నెలా నువు చూపే దృశ్యాలకి మనసు చెదురుతుందే వెన్నెలా/ గుండె కరుగుతుందే వెన్నెలా/ యువరక్తం ఉడుకుతుంది వెన్నెలా... ఇలా వెన్నెలను నేపథ్యంగా చేసుకుని మిల్లు కార్మికుల సమ్మెపై పోలీసులు కురిపించిన తూటాల వర్షాన్ని మన ముందుంచుతాడు. ‘‘అవి అధర్మానివి తుపాకులే/ మిల్లు చుట్టూ మర తుపాకులే/ వాటికెడంగా జన ప్రవాహం’’ కవిత కొనసాగుతుంది. ‘‘ఏ బాధలూ చూడలేక/ఏ అన్యాయాలనీ సహించలేక/ ఏ అధర్మాన్నీ క్షమించలేక/ ఎదిరించినిల్చిన/ తన కొడుకు ప్రాణపు వేడినెత్తురు ఎక్కడమ్మా వెన్నెలా’’ అన్న ప్రశ్నతో వాతావరణం ఆర్ద్రమౌతుంది, బరువెక్కుతుంది, ఎరుపెక్కుతుంది కుందుర్తి వచన కవిత్వంలో కథా కావ్యాలు రావాలని చెప్పిన కాలంలోనే రావిశాస్త్రి కథలో వచన కవిత్వం రాయడం విశేషం. రావిశాస్త్రి కవితాత్మిక రచనలో ఇది పతాక స్థాయి రచన. కిటికీ, విలువలు, జరీ అంచు తెల్లచీర వంటి కథల్లో సుదీర్ఘ కవితాత్మక రచనలు ఉన్నాయి. కేవలం వర్ణనలతో కవితాత్మక వచనం రాయడమే కాకుండా నిర్మాణపరంగా రావిశాస్త్రి వచనంలో కవితాత్మకమైన లక్షణాలు గమనించవచ్చు. ‘విలువలు’ అనే కథలో ఒక వాక్యం ‘‘కలుసుకున్నా నావిణ్ణి మలుపులో’’ అని క్రియాపదంతో ప్రారంభమవుతుంది. ఇది పద్యరచనా లక్షణం తిక్కన ఒకచోట వచ్చినవాడు ఫల్గుణుడు’ అని క్రియాపదంలో మొదలుపెడతాడు. ఆధునిక వచన కవిత్వానికి మేనిఫెస్టో అనదగిన తిలక్‌ అమృతం కురిసిన రాత్రిలో ఆర్తగీతం’ ఖండికలో అనేక పంక్తులు నిజంగా చూసాన్నేను....’’ అనే క్రియావాచకంతో మొదలవడం అందరికీ తెలిసిందే. రావిశాస్త్రికి తన వృత్తికి ఆధారమైన కోర్టు ఒక పెద్దబాలశిక్ష అయితే, కోర్టు కేసుల్లో ఇరుక్కున్న క్లెయింట్‌లు తనకు సృజన పాఠాలు చెప్పిన గురువులు. చాలా కథల్లో కోర్టు ప్రస్తావనలు, వాతావరణం కనిపిస్తాయి. ఆరు సారా కథలులో న్యాయ కథలో ప్రారంభ వాక్యాలు చూడండి’’ గుప్పున సారా కంపు కోర్టు గొల్లున సంతలో కోర్టు. అబద్ధాలకి పాముల పుట్ట కోర్టు బందిలదొడ్డికి రాచబాట కోర్టు’’ ఇదీ కోర్టుల గురించి లాయర్‌ అయిన రావిశాస్త్రి అభిప్రాయం. అది కేవలం అభిప్రాయం మాత్రమే కాదు అనుభవం. ఈ వాక్యాలకింద బ్రాకెట్లలో రచయిత రాసిన ఈ వాక్యాలు కూడా అవధరించండి! (అక్కడ అనాథుల ఆక్రందన, అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటిజాలు. అదేసుమా కోర్టు! అని కూడా నాకు రాయాలని ఉంది. అయితే, సెంటిమెంట్‌ సాబ్‌ స్టఫ్‌, ఏడుపురాత రాసేనని తప్పక చాలామంది వెక్కిరిస్తారు). మన నాటకాలలో ప్రకాశముగా అనీ అనీ సంభాషణలో ఉంటాయి. ఇదీ అలాంటిదే భారత సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా ఎన్‌.వి. రమణగారు ఎంపికయిన సందర్భంగా సామాజిక మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ ఆయన రావిశాస్త్రి కథలనుండి కోర్టు తీర్పులను ఉటంకించిన సందర్భాలు నాతోపాటు కొందరైనా చూసే వుంటారు. రావిశాస్త్రి ఈ కవితాత్మక శైలికి ఆయన ఉపయోగించిన ంఱఎఱశ్రీఱం పోలికలు ఎక్కువగా దోహదం చేసాయని రావిశాస్త్రి మిత్రుడు, ప్రముఖ భాషాశాస్త్ర వేత్త ఒక వ్యాసంలో సవివరంగా వివరించారు. మూర్త విషయాలను మూర్త విషయాలతో పోల్చడం, అమూర్త విషయాలను మూర్త విషయాలతో పోల్చడం ద్వారా రావిశాస్త్రి ఇవి సాధించాడన్నారు. ‘రత్తాలు రాంబాబు’ నవలలో వేశ్యగృహంలో తన స్నేహితురాలు ముత్యాలు ఏడు నిలువుల లోతు నూతిలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు, రత్తాలు పడ్డ మానసిక వేదన, ఆరు చిత్రాల ‘కథాసంపుటిలో’ మామిడిచెట్టు కథలో తను అద్దెకు దిగిన ఇంటి పెరడులోని మామిడి చెట్టు పక్క ఇంటి వారికి నీడనిస్తుందన్న అక్కసుతో మామిడిచెట్టును కొట్టి వేయించిన ఇంటి యజమాని చర్యతో నీడకోసం పలవరించిన నాయకుడి మాటల్లో మనల్ని కవిత్వం పలకరిస్తుంది ఇలా తవ్వుకుంటూ పోతే ఇదో పెద్ద పరిశోధనా గ్రంథం అవుతుంది వీటిని ఇక్కడ ఆపి విశాఖ రచయితల సంఘం కార్యదర్శిగా, విరసం సభ్యుడుగా ఉంటూ ఎన్నో కథలు రాసి ‘ఎన్నెస్‌’ కథలు పేరున కథా సంపుటి వెలువరించిన ఎన్నెస్‌ ప్రకాశరావు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అసువులు బాసినప్పుడు రావిశాస్త్రి రాసిన స్మృతి కవిత ‘ఎన్నెస్‌ ప్రకాశరావు’. కవితలోని కొన్ని పంక్తులు ‘‘నువ్వు లేవు నవ్వులు చిందేవ్‌ నువ్వు లేవు. పువ్వులు అందించావ్‌ కథలెన్నో పండిరచేవ్‌ కలలెన్నో సృష్టించావ్‌. పావురాల వీధిలో డేగలు, కోయిలమ్మ గూటిలో పాములు ఉంటాయని మాకు చెప్పాక నీ మనోధైర్యం నీ గుండె నిబ్బరం మాకాధర్మం ఎన్నెస్‌ ప్రకాశరాయ!’’ అంటూ ఎన్నెస్‌ ఆదర్మాలను గద్గద కంఠంలో గానం చేస్తాడు. ఇవన్ని కథలోనో, కవితలోనో అంతర్భాగంగా ఆయా సన్నివేశాల్ని అంతరంగ మధనాల్ని ఆవిష్కరించడానికి చేసిన వర్ణనలు.ఇవి ఆయా రచనల్లో వచనంలో అంతర్భాగంగా పేరాగ్రాఫ్స్‌ లాగే ఇమిడివున్నాయని మనం గ్రహించాలి. వాక్యం మీద వాక్యంలా కాకుండా, పాదం పక్కన పాదం రాసే వాటిని ఇంగ్లీషులో జూతీశీంవ జూశీవఎం అంటారు. తెలుగులో కవితాత్మక వచనం అంటారు. గతంలో ఆరుద్ర, తర్వాత వేగుంట మోహన ప్రసాద్‌ ఈ రచనలో కృషిచేసారు కవిత్వం కవిత్వంగా రాసినా వచన రచనలో మధ్యలో చెప్పినా ఁAశ్రీషaవం పవ a జూశీవ్‌ – జుఙవఅ ఱఅ జూతీశీంవఁ అని చార్లెస్‌ బొదిలేర్‌ అన్నట్లుగా వచనంలోనూ కవిత్వమై పలవరిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img