Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఓర్మికి చిరునామా

చినుకు రాలకున్నా, చింత పెరుగుతా ఉన్నా
నింగి అంచుల్లో చూపు నిలిపి
ఆశను, గుండె నిండా పరుచుకుంటాడు
చినుకు రాలి, చింత తీరగానే
హలాన్ని భుజాన వేసుకుని
పచ్చని పల్లెతనంలో కరిగి,
పంట భూమిగా విస్తరిస్తాడు
అపశ్రుతుల కలుపును పీకేసి, ఆశయాల విత్తులు నాటి
వరి కంకిjైు మొలకెత్తుతాడు
భవిత ఊహల్లో ఊరిన వేదనా భారాన్ని
గుండె కింద అణిచిపెట్టి
చిరునవ్వును, పెదాల మీద చిలకరిస్తాడు
పురుగులు పంటమీద కెగబాకి
ఆత్మవిశ్వాసాన్ని కొరికేస్తా ఉన్నా
ఎరువులు ఎదురు తిరిగి
ఎగతాళి చేస్తా ఉన్నా
సహనాన్ని, తెల్లని
పంచెకట్టులో నిలుపుతాడు
చేసిన అప్పులు, వడ్డీలలో నాని
హృదయాన్ని పిండేస్తా ఉన్నా
చెదరని హుందాతనాన్ని
తలకి పాగాగా చుడతాడు
పంట పరువాని కొచ్చిన వేళ
పొలం గట్టు మీద నులక మంచమై
కళ్లల్లో దివిటీలు వెలిగించుకుంటాడు
అనుభవంలోంచి జనించిన
కష్ట నష్టాలన్నింటినీ శ్రమ స్వేదంతో కడిగేసి
ఓర్పుకి తనే చిరునామాగా
జాతి నోట అన్నం మెతుకవుతాడు
పండుగలు సంబరాలైనప్పుడు
పల్లె గుమ్మానికి పచ్చ తోరణమై పరవశిస్తాడు
గుడిలో గంటై మోగి
జనసీమను మేల్కొల్పుతాడు
ముంగిట్లో రంగవల్లై
అందరినీ పలకరిస్తాడు
మదిలో తిష్ట వేసిన భారాన్ని కాస్త దులిపేసి
సంతృప్తిని కళ్లల్లో నిలుపుతాడు
వాడు, జన జీవనాడి ఎరిగిన రైతన్న!
`ఎస్‌.ఆర్‌.పృథ్వి, సెల్‌: 9989223245

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img