Monday, April 22, 2024
Monday, April 22, 2024

ఒడిశాలో భారీ వర్షాలు

ముగ్గురు మృతి
లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
భువనేశ్వర్‌ : ఒడిశాలో గత 36 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులలో నీటి మట్టాలు పెరిగాయి. భారీ వర్షాలకు ముగ్గురు మరణించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం మంగళవారం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు గత 24 గంటల్లో రాష్ట్రంలోని 17కు పైగా ప్రాంతాలలో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తాల్చేర్‌లో 394 మి.మీ, బీర్మాహరాజ్‌పూర్‌లో 372 మి.మీ, 15 ఇతర ప్రాంతాలలో 200 నుంచి 300 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు పేర్కొంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయనే ఆందోళనతో ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రత్యేక రిలీఫ్‌ కమిషనర్‌ పి.కె.జెనా కలెక్టర్లను ఆదేశించారు. ‘గ్రామాలు, నివాసాలలోకి వరద నీరు ప్రవేశించినట్లయితే, ఆ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించాలి. ఉపశమన నిబంధనల ప్రకారం, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు వండిన లేదా పొడి ఆహారాన్ని అందించాలి’ అని జెనా కలెక్టర్లకు సూచించారు. సమాచార వ్యవస్థకు ఏదైనా నష్టం జరిగినా వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కూడా ఆదేశించారు. కాగా సోమవారం 3,819 మందిని తరలించిన రాష్ట్ర ప్రభుత్వం, రాత్రంతా వర్షం కొనసాగడంతో తాజా ఆదేశాలు జారీ చేసింది. అఖుపాద వద్ద బైతారాణి నది ప్రమాదకర స్థాయి 17.83 మీటర్లును మించి 17.84 మీటర్లు ప్రవహిస్తోంది. అయితే వసుంధర ప్రమాదకర స్థాయి 54.6 కాగా 53.92 మీటర్ల వద్ద పొంగి పొర్లుతోంది. మదాని వద్ద 5.5 మీటర్ల ప్రమాదకర సూచికను దాటి జలక నది 6.22 మీటర్లు స్థాయిలో ప్రవహిస్తున్నట్లు జల వనరుల విభాగం అధికారులు తెలిపారు. కాగా ఒడిశా ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం రaర్సుగూడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని తర్వాత అల్పపీడనంగా మారుతుందని వాతావరణ కేంద్రం వివరించింది. బుధవారం ఉదయం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రaర్సుగూడ, సుందర్‌గర్‌, మయూర్‌భంజ్‌, భద్రక్‌, బాలాసోర్‌, కేంద్రపర, జాజ్‌పూర్‌, దియోగర్‌, సంబల్‌పూర్‌, నౌపడ, నబరంగపూర్‌, బోలంగిర్‌, కియోంజర్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img