Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

ఓటు విషయంలో..బెంగాల్‌ ప్రజలకు స్వేచ్చ లేదు

: గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ పాలనపై నిత్యం చిర్రు బుర్రు లాడే గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ రాష్ట్రంలో భయానకమైన రాజకీయ పరిస్థితులున్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బెంగాల్‌ ప్రజలకు ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికల అనంతరం కూడా అనేక హింసాత్మక ఘటనలు చూశామని పేర్కొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌గా తాను కోరిన సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం మమతా బెనర్జీ కూడా తాను గతంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. గవర్నర్‌ గురించి ఏమైనా మాట్లాడే హక్కు తనకు ఉందని స్పీకర్‌ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 గురించి స్పీకర్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు. తన విచక్షణ అధికారాల విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే తాను సహించనని పేర్కొన్నారు. ప్రభుత్వం తనకు పంపిన బిల్లులు, పైళ్లు ఏవీ తన వద్ద పెండిరగులో లేవని తెలిపారు. ఇదిలా ఉండగా గవర్నర్‌ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్‌ ఆయన వ్యాఖ్యలు అత్యంత అమర్యాదకరమైనవని పేర్కొన్నారు. తనపరిధిలో తాను పని చేస్తున్నానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img