Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కరోనా ముప్పు.. పండగల నిర్వహణ ప్రమాదకరం


: ఐఎంఏ
కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు ముంచెత్తుతుందనే అంచనాల నడుమ పండగల నిర్వహణ ప్రమాదకరమని భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) చీఫ్‌ డాక్టర్‌ జేఏ జయలాల్‌ హెచ్చరించారు. పూరి, అహ్మదాబాద్‌లో జగన్నాధ్‌ రథయాత్రలకు అనుమతించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడుతారని, కాబట్టి ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతించరాదని విజ్ఞప్తి చేశారు. కన్వర్‌ యాత్రను జులై చివరలో శ్రావణ మాస ఆరంభం నుంచి ఆగస్టు ప్రథమార్ధం వరకూ దాదాపు పదిహేను రోజుల పాటు జరుపుతారు. ఉత్తరప్రదేశ్‌, దిల్లీ, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌లకు చెందిన భక్తులు అధికంగా కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా వ్యాప్తితో గత ఏడాది ఈ యాత్రను రద్దు చేశారు. అయితే ఈ ఏడాది జులై 25 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ కన్వర్‌ యాత్రను నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img