Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

కాంగ్రెస్‌లో చేరిన సోనూసూద్‌ సోదరి మాళవికా


చండీగఢ్‌ : నటుడు సోనూ సూద్‌ సోదరి మాళవికా సోమవారం పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం పంజాబ్‌కు చెందిన మోగాలోని వారి నివాసంలో సూద్‌, మాళవికాలను సిద్ధూ కలిశారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమేనని, ఈ ఉద్దేశంతోనే మాళవికా పార్టీలో చేరారని పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం అన్నారు. ‘ఇప్పుడు మోగా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img