Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : కేజ్రీవాల్‌

గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జెండా ఎగురవేస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలుచుకుంటామని ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ కన్వీనర్‌, ఢల్లీి సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. గురువారం గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా కేజ్రీవాల్‌ స్పందించారు. బీజేపీపై పాలనపై గుజరాత్‌ ప్రజలు విసిగిపోయారని, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఈసారి బీజేపీకి భంగపాటు తప్పదని అన్నారు. గుజరాత్‌ లోని 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img