Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

‘డోలో-650’ మాత్రలు తయారు చేసే ఫార్మా కంపెనీపై ఐటీ దాడులు

దేశవ్యాప్తంగా బాగా ఆదరణ ఉన్న డోలో-650 (పారాసిటమాల్‌ 650 ఎంజీ) మాత్రల తయారీ సంస్థపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా డోలో మాత్రల వినియోగం విపరీతంగా పెరగడం, వాటి తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌ ఫార్మా సంస్థ గణనీయంగా లాభాలు ఆర్జించడం వంటి వార్తల నేపథ్యంలో తాజా ఐటీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కంపెనీ బెంగళూరు ప్రధాన కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో 200 మందికిపైగా అధికారులు సోదాలు చేసినట్టు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. పలు కీలక పత్రాలు సేకరించినట్టు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img