Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

బీజేపీని వీడిన గుజరాత్‌ మాజీ మంత్రి..

గుజరాత్‌ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు జే నారాయణ్‌ వ్యాస్‌ ఆ పార్టీని వీడారు. పార్టీ తీరుపై విసుగుచెందిన తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు శనివారం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ లేదా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరవచ్చని సంకేతం ఇచ్చారు. ‘నేను బీజేపీతో విసిగిపోయాను. అందుకే పార్టీకి రాజీనామా చేశాను. ఇతర పార్టీలో చేరే ఆప్షన్లు తెరిచే ఉన్నాయి. రాబోయే గుజరాత్‌ ఎన్నికల్లో సిద్ధపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’ అని మాజీ ఆరోగ్య మంత్రి అయిన నారాయణ్‌ వ్యాస్‌ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో బీజేపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img