Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మంగళూరులో నిషేధాజ్ఞలు

వరుసగా రెండు హత్యలు
స్కూళ్లు ` మద్యం దుకాణాలు మూసివేత

మంగళూరు: కర్ణాటకలో బీజేపీ యువ మోర్చా నేత ప్రవీణ్‌ నెట్టర్‌ హత్యను మరువక ముందే మహమ్మద్‌ ఫాజిల్‌ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురికావడం కలకలం రేపింది. కేవలం రెండు రోజుల తేడాలో రెండు హత్యలు జరగడంతో అప్రమత్తమైన కర్ణాటక ప్రభుత్వం మంగళూరులో ఆంక్షలు విధించింది. వేర్వేరు వర్గాల ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. దక్షిణ కర్ణాటకలో ఉద్రిక్తత దృష్ట్యా కన్నడ, ఉడిపి జిల్లాల్లో భద్రతను పెంచారు. సూరత్‌కల్‌, బాజ్‌పే, ముల్కి, పన్నంబూర్‌ పోలీసు స్టేషన్ల పరిధిలోని స్కూళ్లను మూసివేశారు. ప్రవీణ్‌ హత్య కేసులో బళ్లారికి చెందిన ఇద్దరిని అరెస్టు చేయగా ఫాజిల్‌ హత్య కేసు విచారణ సాగుతోంది. నలుగురు హంతకుల కోసం గాలిస్తున్నారు. శుక్రవారం ఫాజిల్‌ అంత్యక్రియలు జరుగగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. శనివారం ఉదయం వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని మంగళూరు పోలీసు కమిషనర్‌ ఎన్‌ శశికుమార్‌ తెలిపారు. మద్యం దుకాణాలన్నీ మూసివేసినట్లు అధికరి చెప్పారు. కర్ణాటక`కేరళ సరిహద్దుతో పాటు 19 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా ప్రతి వాహనం తనిఖీ జరుగుతుందని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎవ్వరూ బయట కనిపించేందుకు వీల్లేదన్నారు.
ఫాజిల్‌ హత్యను కర్ణాటక హోంమంత్రి అరాగా జ్ఞానేంద్ర తీవ్రంగా ఖండిరచారు. ఆగంతులను ఉపేక్షించేది లేదని చెప్పారు. ముఖ్యమంత్రి బొమ్మై గురువారం సాయంత్రం ప్రవీణ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. వరుస హత్యలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img