Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

మణిపూర్‌ సీఎంగా బీరెన్‌ సింగ్‌ ప్రమాణం

ఇంఫాల్‌: మణిపూర్‌ సీఎంగా బీరెన్‌ సింగ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీరెన్‌ నేతృత్వంలోని బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించడంతో మరోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్‌ అసెంబ్లీలో.. బీజేపీ 32 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఆయననే సభానాయకుడిగా ఎంపికయ్యారు. మణిపూర్‌ సీఎంగా బీరెన్‌ సింగ్‌ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది రెండవసారి. సీఎం బీరెన్‌ సింగ్‌తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీరెన్‌ క్యాబినెట్‌లో నెమ్‌చా కిప్‌జెన్‌, వై కేమ్‌చాంద్‌ సింగ్‌, బిశ్వజిత్‌ సింగ్‌, అవాంగ్‌బో నెవ్‌మాయి, గోవిందదాస్‌ కొంతుజంలు మంత్రులుగా చేరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img