Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

మళ్లీ ‘తెర’ లేచింది..!

నాలుగు నెలల తర్వాత వినోద తరంగం
సిబ్బందికి వాక్సినేషన్‌తో వీక్షకులకు హామీ
కఠినంగా కొవిడ్‌ మార్గదర్శకాల అమలు

న్యూదిల్లీ : కరోనా మహమ్మారి వినోద రంగాన్ని కోలుకోని దెబ్బతీసింది. వైరస్‌ రెండవ దశ కారణంగా మూతపడ్డ సినిమా హాళ్లు ఎంపిక చేసిన రాష్ట్రాలలో దాదాపు నాలుగు నెలల తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. మల్టీప్లెక్స్‌ చైన్‌లు ఇప్పుడు మరింత మంది వీక్షకులను ఆకర్షించేందుకు సరికొత్త చిత్రాలతో తెరలను పైకి లేపాయి. పీవీఆర్‌, ఐనాక్స్‌, సినీపోలీస్‌ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్‌ చైన్‌లు ప్రస్తుత పరిస్థితులలో వీక్షకులను తిరిగి రప్పించుకునేందుకు భద్రతకు భరోసాగా వారి మొత్తం సిబ్బందికి, సహాయక సిబ్బందికి కొవిడ్‌ టీకాలు అందించాయి. అలాగే ప్రేక్షకు లను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను వరుసలో పెట్టాయి. మల్టీప్లెక్స్‌ ఆపరేటర్లు అనుమతించిన రాష్ట్రాలలో గత శుక్రవారం తమ కొన్ని సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించారు. కరోనా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్నారు. రానున్న వారాల్లో దశల వారీగా మరిన్ని స్క్రీన్‌లను ప్రారం భించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. దీంతోపాటు మల్టీప్లెక్స్‌లు ఇప్పుడు కుటుంబాలు, చిన్న సమూహాల కోసం ఆపరేషనల్‌ స్క్రీన్‌లలో వినోద బబుల్‌, వ్యక్తిగతీకరించిన సేవ, అనుకూలీ కరించిన ఆహార ప్యాకేజీ, వారికి నచ్చిన కంటెంట్‌తోపాటు ప్రస్తుత కొత్త సినిమాల నుండి పాత బ్లాక్‌ బ్లస్టర్‌ చిత్రాలను కూడా అందిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ కంపెనీగా ఉన్న పీవీఆర్‌ 526 స్క్రీన్‌ల నిర్వహణకు అనుమతి పొందింది. వాటిలో దాదాపు 25 శాతం ప్రస్తుతం పని చేస్తున్నాయి. ‘ఈరోజుకు భారత్‌లోని 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో పీవీఆర్‌ ఉంది. భౌతిక దూరం వంటి నిబంధనలు అనుసరిస్తూ సినిమా హాళ్లను తెరుచుకునేందుకు అనుమతి పొందాము’ పీవీఆర్‌ సీఈవో గౌతమ్‌ దత్తా తెలిపారు. ‘మేము జులై 30 నుంచి మా సినిమా థియేటర్లను ప్రారంభించాం’ అని అన్నారు. ఇక రెండో అతిపెద్ద ఎగ్జిబిటర్‌గా ఉన్న ఐనాక్స్‌ తన 650 స్క్రీన్‌ లలో దాదాపు మూడిరట ఒక వంతు నడుపుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను పెంచనున్నట్లు ఐనాక్స్‌ అధికారి ఒకరు తెలిపారు. అలాగే మెక్సికన్‌ మూవీ థియేటర్‌ చైన్‌ సినీ పోలీస్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ సినీ పోలీస్‌ ఇండియా ఇక్కడ 360 స్క్రీన్‌లు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాలలో వాటిని తిరిగి తెరిచింది. అలాగే ముక్తా ఏ2 సినిమాస్‌ కూడా విశాఖ పట్టణంలో తన థియేటర్లను తెరిచింది. రానున్న వారాలలో మరిన్ని స్క్రీన్‌లను ప్రారంభిస్తామని ముక్తా ఆర్ట్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ పురి తెలిపారు. కాగా మల్టీప్లెక్స్‌ చైన్‌లు డిజిటల్‌ కాంటాక్టు ద్వారా మానవ సంబంధాన్ని తగ్గిస్తున్నాయి. ‘భౌతిక దూరాన్ని తగ్గించడానికి పీవీఆర్‌ యాప్‌ ద్వారా ఆర్డర్‌ చేసి పికప్‌ కౌంటర్ల నుండి ముందుగానే భోజనాన్ని తెప్పించుకోవచ్చు. అత్యంత తాకే ఉపరితలాలపై యాంటీ-మైక్రోబయల్‌ ఫిల్మ్‌ వాడకం, హాస్పిటల్‌-గ్రేడ్‌ విరుసైడ్‌తో కీ టచ్‌ పాయింట్లను గంటకొకసారి క్రిమిసంహారక చేయడం, అన్ని ఫుడ్‌ ప్యాకేజింగ్‌ని క్రిమిరహితం చేయడానికి యూవీ క్యాబినెట్‌లను ఉపయోగించడం వంటివి ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లలో అనుసరిస్తున్నాము’ అని పీవీఆర్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img