Friday, March 31, 2023
Friday, March 31, 2023

రిషీ అగర్వాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూదిల్లీ: ఏబీజీ షిప్‌యార్ట్‌ మాజీ చైర్మన్‌ Ê మేనేజింగ్‌ డైరెక్టర్‌ రిషీ అగర్వాల్‌ సోమవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. రూ.22,948కోట్ల బ్యాంకును మోసగించారనే ఆరోపణలపై కేంద్ర విచారణ సంస్థ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతవారం అగర్వాల్‌ను సీబీఐ ప్రశ్నించగా, అదే పరంపరను కొనసాగిస్తూ సోమవారం కూడా అగర్వాల్‌ను ప్రశ్నించింది. భవిష్యత్‌లో కూడా ఈ విచారణ కొనసాగుతుందని సీబీఐ పేర్కొంది. అయితే పెద్ద ఎత్తులు నిధుల మళ్లింపు జరిగిందని బ్యాంకుకు చెందిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈవిషయం బయటపడిరదన్నది తెలిసిందే. దీనిపై ఫిబ్రవరి 7 సీబీఐ కేసు నమోదు చేసింది. అంతకుముందు ఎస్‌బీఐ ఈ విషయమై ఆగస్టు 25,2020న ఫిర్యాదు చేసింది. ఇంకా ఈ కేసులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శాంతనమ్‌ ముత్తుసామి, డైరెక్టర్లు అశ్విన్‌ కుమార్‌, సుశీల్‌ కుమార్‌ అగర్వాల్‌, రవి విమల్‌ నివేతియా, మరో కంపెనీ ఏబీజీ ఇంటర్నేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ కుట్ర కోణంలో పాలుపంచుకున్నాయని, వీరందరిపై పలు సెక్షన్‌కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ వివరించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే ఫిబ్రవరి 12న సీబీఐ 13 ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img