Sunday, November 27, 2022
Sunday, November 27, 2022

రోటావాక్‌-5డి వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన రోటావాక్‌-5డి వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదం తెలిపింది.ఐదేళ్లలోపు వయసున్న చిన్న పిల్లల్లో ప్రాణాంతక డయేరియా వ్యాధికి రోటా వైరస్‌ కారణమవుతోంది. ఈ వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. పిల్లల్లో వ్యాపించే రోటా వైరస్‌ నుంచి ఈ వ్యాక్సిన్‌ మరింత రక్షణ కల్పించటమే కాకుండా నిల్వ, సరఫరాకు తక్కువ ఖర్చు అవుతుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఇప్పటికే రోటావాక్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ వ్యాక్సిన్‌ను మరింత అభివృద్ధి చేసి రోటావాక్‌ 5డిగా తయారుచేసింది.ఈ వ్యాక్సిన్‌ తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉంటుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడిరచింది. ఐదు చుక్కల 0.5 ఎంఎల్‌ డోసేజ్‌తో నోటి ద్వారా ఇచ్చే ఈ మోనోవాలెంట్‌ టీకాను నాలుగు వారాల తేడాతో మూడు డోసుల్లో చిన్నారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎనిమిది నెలలలోపు వయసున్న పిల్లలకు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ ఇవ్వాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img