Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

వంతెన కింద ఇరుక్కున్న పాత విమానం.. వీడియో వైరల్‌

తుక్కు కింద విక్రయించిన ఎయిర్‌ఇండియా విమానం ఒకటి దిల్లీలో జాతీయ రహదారి ప్రాంతంలో వంతెన కింద ఇరుక్కుంది. దాన్ని కొన్న యజమాని శనివారం రహదారి మార్గంలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ వంతెన కింద ఇరుక్కుపోయిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. అయితే విమానం ఇరుక్కు పోవడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.విమానం ముందు భాగం వంతెన దాటిందని, వెనుక భాగం వంతెన వద్ద ఇరుక్కుందని అధికారులు చెప్పారు. కాగా ఎయిర్‌ ఇండియా విమానం పాదచారుల వంతెన కింద ఇరుక్కుపోయిన ఘటనతో తమకు సంబంధం లేదని, ఆ పాత విమానాన్ని తుక్కు కింద విక్రయించామని ఎయిర్‌ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img