Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

వేసవి సందర్భంగా 574 ప్రత్యేక రైళ్లు

వేసవి సందర్భంగా ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాలకు 574 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడిరచారు. ముంబై, పూణే, నాగ్‌పూర్‌, షిర్డీ నుండి వేసవి స్పెషల్‌ రైళ్లు నడిపించనున్నారు. ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు ప్రయాణీకుల అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకుని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ ముంబై, లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ పన్వెల్‌, పూణే, నాగ్‌పూర్‌, సాయినగర్‌ షిర్డీ నుండి వివిధ గమ్యస్థానాలకు రైళ్లు నడుస్తాయి. ఇందులో తిరుపతి-హైదరాబాద్‌, తిరుపతి-ఔరంగాబాద్‌ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడిరచింది. హైదరాబాద్‌-తిరుపతి (07509) రైలు శనివారం సాయంత్రం 4.35కు హైదరాబాద్‌ నుంచి బయలుదేరుతుందని మరుసటిరోజు ఉదయం 5.30 గంటలకు తిరుపతి చేరుకుంటుందని తెలిపింది. ఈ రైలు ఏప్రిల్‌ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా తిరుపతి-హైదరాబాద్‌ రైలు (07510) మంగళవారం 11.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుందని మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌ చేరకుంటుందని వెల్లడిరచింది.ఈ సర్వీసు మే 3, 10, 17, 24, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఇక తిరుపతి-ఔరంగాబాద్‌ (07511) స్పెషల్‌ ట్రెయిన్‌ ఆదివారం ఉదయం 07.05 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు 7 గంటలకు ఔరంగాబాద్‌ చేరుకుంటుందని చెప్పారు. ఇది మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుందని వివరించారు. ఔరంగాబాద్‌ (07512) నుంచి సోమవారం(మే 2) రాత్రి 11.15 గంటలకు బయలుదేరుతుందని మరుసటి రోజు రాత్రి 10.15 గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఇది మే 2, 9, 16, 23, 30 తేదీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. కాగా, ఈ రైలు సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర మీదుగా వెళ్తాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img