Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో మరో వ్యక్తి అరెస్టు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో పోలీసులు ఇవాళ ముంబైలోని ఖార్‌ ప్రాంతంలో మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) పోలీసులు కునాల్‌ జాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.కునాల్‌ జాని సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు స్నేహితుడు.సుశాంత్‌ మరణం తర్వాత అతను పరారీలో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసుతో లింకు ఉన్న అనేక మందిని అరెస్టు చేశారు.గత ఏడాది జూన్‌ 15వ తేదీన సుశాంత్‌ అనుమానాస్పద రీతిలో బాంద్రాలోని తన ఫ్లాట్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img