Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అంతరిక్షంలో నివసిస్తున్నారా ?

ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌దారుపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూదిల్లీ : కోవిడ్‌-19 ఒమిక్రాన్‌ వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తిరస్కిరించింది. కాంగ్రెస్‌ నేత దాఖలు చేసిన జగదీష్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలను కొన్ని వారాల పాటు వాయిదా వేయాలని కోరారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో క్వారంటైన్‌ కాలాన్ని 14 రోజులవరకూ పెంచాలని, మందులు, ఆక్సిజన్‌ సహా ఇతర అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని దిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ విపిన్‌ సంఫీు, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ల ధర్మాసనం పిటిషన్‌దారునిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు అంతరిక్షంలో నివసిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. ఇప్పుడు దిల్లీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంటూ పిటిషన్‌ దారుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనరే స్వయంగా తన పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని లేదంటే తాము జరిమాన విధించాల్సి ఉంటుందని హెచ్చరించడంతో శర్మ తరపున న్యాయవాది ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img