Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అభివృద్ధికి చిహ్నం మోదీ : అమిత్‌షా

అహ్మదాబాద్‌ : అభివృద్ధికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనియాడారు. ఒకవేళ తాను అధికారం నుంచి దిగిపోయినా అభివృద్ధి పనులు కొనసాగించేలా వ్యవస్థలను సృష్టించిన మొదటి నాయకుడు బహుశా నరేంద్రమోదీయేనని అమిత్‌షా చెప్పారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ సాగించిన పాలనను ఉటంకించారు. గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని అహ్మదాబాద్‌, దాని పరిసర ప్రాంతాల్లో రూ.244 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అమిత్‌షా ఆదివారం శంకుస్థాపన చేశారు. మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్‌లో ప్రారంభించిన అభివృద్ధి పనులను ఆయన ప్రశంసించారు. ‘రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం తర్వాత చాలా రకాల నాయకులను నేను చూశాను. చాలామంది వారు అనుకున్న పనులు చేసుకుంటూ పోయారు. రిబ్బన్లు కట్‌ చేశారు. కొంతమంది తమ హయాంలో గొప్ప అభివృద్ధి పనులు చేపట్టారు. అందుకోసం తీవ్రంగా కష్టపడ్డారు. అయితే నరేంద్రమోదీ వంటి ఏ కొద్దిమందో తాము ప్రారంభించిన పనులు మధ్యలో ఆగకుండా ఉండేలా అభివృద్ధి పనులు కొనసాగించారు. తాను అధికారం నుంచి దిగిపోయినా ఆ ప్రాజెక్టులు కొనసాగించేలా వ్యవస్థలను, యంత్రాంగాలను నిర్మించారు’ అని వివరించారు. మోదీ 14 ఏళ్ల పాలనలో గుజరాత్‌కు ఎంతో మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. మోదీ ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఆయన ప్రారంభించిన పనులు కొనసాగాయన్నారు. గాంధీనగర్‌ లోక్‌సభ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యతని, ఇందుకు సహకరిస్తున్న అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img