Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆకాశంలో అద్భుతాలు

12న ఒకే వరుసలోకి చంద్రుడు, ఐదు గ్రహాలు
జెమినిడ్‌ మిటియోర్‌ షవర్‌ కూడా

న్యూదిల్లీ : ఖగోళంలో అరుదైన దృశ్యాలు ఆవిషృతం కానున్నాయి. ఈనెల 6`10 తేదీల్లో మూడు గ్రహాలు వరుస కట్టగా ఈ వరుసలోకి మరో రెండు గ్రహాలు, చంద్రుడు రావడంతో వీక్షకులకు ఆదివారం (12వ తేదీ) పండుగ రోజుగా మారింది. జ్యుపిటర్‌ (గురుడు), వీనస్‌ (శుక్రుడు), సాట్రన్‌ (శని) గ్రహాలతో పాటు చంద్రుడు క్యూకట్టాయి. టెలిస్కోప్‌ లేకుండా ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చు అని ఖగోళశాస్త్రజ్ఞులు తెలిపారు. చంద్రుడు.. శుక్రుడు పక్కకు చేరిన వారం తర్వాత శని, గురు గ్రహాల పక్కగా ప్రయాణిస్తాడు. ఫొటోగ్రాఫర్లకు, టెలిస్కోప్‌ ద్వారా నక్షత్రాలను వీక్షించే వారు దీనిని చూడగలగడం అదృష్టంగా భావిస్తారు. 12వ తేదీ సూర్యాస్తమం తర్వాత ఐదు గ్రహాలు కంటికి కనిపిస్తాయని సెయింట్‌ ల్యూయిస్‌ ఆస్ట్రానమీ ఫేస్‌బుక్‌ పేజి పేర్కొన్నట్లు ఫాక్స్‌ 4 పేర్కొంది. మేఘాలు లేకుండా ఉంటే బైనాకులర్‌ లేదా చిన్న టెలిస్కోప్‌ సాయంతో వరుస కట్టిన గురు,శుక్ర,శని గ్రహాలతో పాటు నెప్యూటన్‌ (ఇంద్రగ్రహం), యురానస్‌ (వరుణగ్రహం), సిరెస్‌ అనే చిన్న గ్రహం, పల్లాస్‌ భారీ శకలాన్ని కూడా వీక్షించవచ్చునని తెలిపింది. గతేడాది జులై 19న ఇదే విధంగా ఐదు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. అప్పట్లో మెర్క్యూరీ (బుధుడు), గురుడు, శని, అంగారకుడిని టెలిస్కోప్‌ లేకుండానే చూడగలిగారు. ఇప్పుడు జెమినిడ్‌ మిటియార్‌ షవర్‌ కూడా తోడవడంతో ఆకాశంలో అద్భుతాలు జరగనున్నట్లు చెప్పొచ్చు. నాసా ప్రకారం ప్రతి డిసెంబరులో మీడియార్‌ షవర్‌ ఉంటుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img