Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆత్మగౌరవంపై రాజీ పడినా బాధే కలిగింది


అఖిలేశ్‌పై శివపాల్‌ యాదవ్‌ ధ్వజం
లక్నో : సోషలిస్ట్‌ నాయకుడు శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ మంగళవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, తన మేనల్లుడు అఖిలేశ్‌ యాదవ్‌పై ధ్వజమెత్తారు. ‘తనను తాను ‘తృప్తిపరుచుకోవడానికి’ ఆత్మగౌరవంపై రాజీ పడినప్పటికీ తిరిగి బాధే కలిగింది’ అని అన్నారు. ‘మేము అతనికి ఎలా నడవాలో నేర్పించాం. అతను మమ్మల్ని తొక్కుతూనే ఉన్నాడు’ అని ప్రగతిశీల సమాజ్‌ వాదీ పార్టీ-లోహియా (పీఎస్‌పీఎల్‌) అధ్యక్షుడు తన మేనల్లుడితో విభేదాలు వచ్చినట్లు వస్తున్న వార్తల నడుమ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆత్మగౌరవం అనే అట్టడుగు స్థాయికి దిగి అతన్ని సంతృప్తి పరచాలని ప్రయత్నించాను! అయినప్పటికీ, నేను కోపంగా ఉంటే.. అతను నా హృదయాన్ని ఎంతవరకు బాధ పెట్టి ఉంటాడో…’ అని సోషలిస్ట్‌ నాయకుడు తన ట్వీట్‌లో ఎవరి పేరును ప్రస్తావించకుండా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీతో శివపాల్‌ సింగ్‌ యాదవ్‌ పొత్తు కుదుర్చుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నాయకులు విడిపోయారు. ఆ తర్వాత శివపాల్‌ సొంత పార్టీని స్థాపించారు. అయితే ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ పిలుపు మేరకు ఆయన ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గుర్తుపై పోటీ చేశారు. మార్చిలో జరిగిన ఎస్పీ ఎమ్మెల్యేల సమావేశానికి శివపాల్‌ యాదవ్‌ను ఆహ్వానించకపోవడంతో ఇద్దరి నేతల మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. దీంతో శివపాల్‌ శాసనసభ్యునిగా ప్రమాణం చేయడంలో జాప్యం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, శివపాల్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. ఇది బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందనే ఊహాగానాలకు దారితీసింది. అలాగే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం ఆదిత్యనాథ్‌లను వారి ట్విట్టర్‌ ఖాతాలలో అనుసరించడం ప్రారంభించినప్పుడు అది మరింత విస్తృతమయింది. బీజేపీతో సాన్నిహిత్యం పెరుగుతోందన్న వార్తలపై అఖిలేశ్‌ యాదవ్‌ తన మామ శివపాల్‌పై అనేక సందర్భాల్లో విరుచుకుపడ్డారు. బీజేపీతో సన్నిహితంగా ఉండే వారికి సమాజ్‌వాదీ పార్టీలో స్థానం లేదని ఓ సందర్భంలో ఆయన తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img