Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆ క్రూర నిర్ణయానికి ఐదేళ్లు

తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శలు
కోల్‌కతా : దేశంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని సోమవారానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. పెద్దనోట్ల రద్దును మోదీ సర్కారు సమర్థించుకుంటుండగా.. విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దీనిపై తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందించింది. ‘2016 నవంబరు 8న కేంద్రం నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించగానే.. మమతా బెనర్జీ మాత్రమే దాన్ని గుర్తించారు. ఆ క్రూరమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వరుసగా ట్వీట్లు చేశారు’ అంటూ తృణమూల్‌ సీనియర్‌ నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ వెల్లడిరచారు. ఆ సమయంలో మమత చేసిన ట్వీట్ల స్క్రీన్‌షాట్‌ను జత చేశారు. ‘ఈ క్రూరమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి’ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ వేళ కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత వరుస ట్వీట్లలో కేంద్ర ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకించారు. ఎన్నికల వేళ నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. ఆ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకు తీసుకున్న నిర్ణయమంటూ మండిపడ్డారు. చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజల గురించి వాటిలో ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img