Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇంటర్‌పోల్‌తో కలిసి సీబీఐ ‘ఆపరేషన్‌ గరుడ’…

దేశవ్యాప్తంగా ఆపరేషన్‌ గరుడ పేరుతో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై చర్యల్లో భాగంగా ఇంటర్‌పోల్‌ సహకారంతో ఈ సోదాలను సీబీఐ నిర్వహిస్తోంది. డ్రగ్స్‌ ముఠాలకు చెందిన 170 మందిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్‌ చేసి, పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ ప్రకటించింది. మొత్తం 125 కేసులు నమోదుచేసినట్టు తెలిపింది.పంజాబ్‌, ఢల్లీి, హిమాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాలు పోలీసులు, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులతో కలిసి ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టినట్టు పేర్కొంది. మొత్తం 6,600 అనుమానితులను తనిఖీ చేసినట్టు చెప్పింది. పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సహా దాదాపు 175 మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడిరచింది. భారీ మొత్తంలో మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img