Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈ నెల 24 నాటికి బంగాళాఖాతంలో తుపాను

ఉత్తర అండమాన్‌ సముద్రం, దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ప్రాంతం ఏర్పడిరదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడిరచింది. ఇది ఈ నెల 22 నాటికి వాయుగుండంగా మారుతుందని, ఈ నెల 23వ తేదీకి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని, ఈ నెల 24 నాటికి మరింత బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ తాజా బులెటిన్‌ లో వివరించింది. తుపానుగా మారిన అనంతరం ఇది దిశ మార్చుకుని ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని పేర్కొంది. అక్టోబరు 25 నాటికి ఒడిశా తీరాన్ని తాకుతూ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాలకు చేరువలోకి వస్తుందని వెల్లడిరచింది. అటు, నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని, మరో రెండ్రోజుల్లో దేశంలోని అన్ని భాగాల నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరుగుతాయని ఐఎండీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img