Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోవాగ్జిన్‌ నిల్వ సమయం 12 నెలలకు పొడిగింపు

న్యూదిల్లీ : కోవిడ్‌`19 వాక్సిన్‌ ‘కోవాగ్జిన్‌’ నిల్వ సమాయాన్ని 12 నెలలకు పొడిగించడానికి సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) ఆమోదం తెలిపిందని భారత్‌ బయోటెక్‌ బుధవారం వెల్లడిరచింది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి 12 నెలల వరకు కోవాగ్జిన్‌ నిల్వ ఉంటుందని పేర్కొంది. సీడీఎస్‌సీఓకు అందించిన అదనపు సుస్థిరత డేటా లభ్యత ఆధారంగానే ఈ నిర్ణయం జరిగినట్లు ట్విట్టర్‌లో వెల్లడిరచింది. ఇదే విషయాన్ని తమ భాగస్వాములకు సమాచారం ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img