Friday, May 3, 2024
Friday, May 3, 2024

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారమివ్వాలి

కేంద్రానికి కాంగ్రెస్‌ డిమాండు ` ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్‌
న్యూదిల్లీ : కోవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4లక్షలు చొప్పున పరిహారమివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ కేంద్రాన్ని డిమాండు చేసింది. ఇదే విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ శనివారం ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రారంభించారు. కోవిడ్‌తో దేశం సతమతమవుతూ సొంతవారిని కోల్పోయి ప్రజలు బాధలో ఉంటే కేంద్రం మొద్దునిద్ర పోతోందని విమర్శించారు. మొద్దనిద్రలో నుంచి పాలకులను మేల్కొపాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘స్పీక్‌ అప్‌ ఫర్‌ కోవిడ్‌ న్యాయ్‌’ (కోవిడ్‌ న్యాయం కోసం గొంతెత్తండి) హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. కోవిడ్‌ బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇప్పించడమే తమ ఈ ప్రచార ఉద్దేశమని కాంగ్రెస్‌ అధికారిక ఖాతా పేర్కొంది. కోవిడ్‌ మృతుల కచ్చిత సంఖ్యను బయట పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వెల్లడిరచింది. మోదీ ప్రభుత్వం రూ.50వేల పరిహారం ఇచ్చి చేతులు దులిపివేసుకోవాలని భావిస్తోందని పేర్కొంది. అనేక రాష్ట్రాల కాంగ్రెస్‌ శాఖలతో పాటు ఆ పార్టీ నేతల ఖాతాల్లోనూ ఆన్‌లైన్‌ ప్రచారానికి మద్దతుగా వీడియోలు పెట్టారు. కోవిడ్‌ బాధితులకు పరిహారం కోసం పార్లమెంటులోనూ కాంగ్రెస్‌ డిమాండు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img