Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గోవాలో ఎవరితోనైనా పొత్తుకు సిద్ధమే

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వెల్లడి
పనాజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచడానికి ఏ పార్టీ మద్దతు తీసుకోవడానికైనా సిద్ధమేనని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పి.చిదంబరం స్పష్టంచేశారు. బీజేపీ ఓటమే కాంగ్రెస్‌ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గోవా ఫార్వర్డు పార్టీ(జీఎఫ్‌పీ), కాంగ్రెస్‌తో ఎన్నికల ముందు పొత్తుకు తమ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గోవా ఇన్‌చార్జి మహువా మొయిత్రా ప్రకటించిన మరుసటి రోజే చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటనను ఈ రోజు వార్తాపత్రికల్లో చూశానని, ‘అధికారిక మాట’ కోసం వేచిచూస్తున్నామని చిదంబరం శనివారం ఇక్కడ విలేకరులకు చెప్పారు. బీజేపీని ఒంటరిగా ఓడిరచే సత్తా కాంగ్రెస్‌కు ఉందని, అయితే, బీజేపీని ఓడిరచడానికి కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఏ పార్టీjైునా కోరుకుంటే తానెందుకు వద్దని చెబుతానని చిదంబరం ప్రశ్నించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 17 సీట్లు గెలిచిన తర్వాత గడచిన ఐదేళ్లలో కాంగ్రెస్‌ తన బలాన్ని క్రమంగా కోల్పోయింది. చాలామంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి, ఇద్దరు తృణమూల్‌లోకి ఫిరాయించారు. కాంగ్రెస్‌కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. గోవా ఫార్వర్డు పార్టీతో ఎన్నికల ముందు పొత్తు ఉంటుందని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌తో మహారాష్ట్రవాది గోమంతక పార్టీ(ఎంజీపీ) పొత్తు కుదుర్చుకుంది. బీజేపీని ఓడిరచడానికి గల అన్ని అవకాశాలను ఉపయోగిస్తామని మొయిత్రా ట్వీట్‌ చేశారు. 40మంది సభ్యులు గల గోవా అసెంబ్లీలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, కొంతమంది ఇండిపెండెంట్లు, ప్రాంతీయ పార్టీల సహకారంతో 13 సీట్లు గెలిచిన బీజేపీ అధికారం చేపట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img