Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గోవుల సంరక్షణకు మేతపై లెవీ ట్యాక్స్‌ : ఎంపీ సీఎం

భోపాల్‌ : ఆవులు తినే మేతపై లెవీ ట్యాక్స్‌ విధించేలా ప్రణాళిక తయారు చేయాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధికారులను ఆదేశించారు. ఈ లెవీతో పశువుల సంరక్షణకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం చౌహాన్‌ మధ్యప్రదేశ్‌ గోపాలన్‌ ఏవం పశుధన్‌ సంవర్ధన్‌ బోర్డు సమావేశంలో పాల్గొని ఈ ఆదేశాలు జారీ చేశారు. ‘పశువుల మేతపై ట్యాక్స్‌ వేయాలన్న ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి మాకు సూచించారు. గోవులను సంరక్షించేందుకు ప్రజల సహకారం కూడా తీసుకోవాలని ఆదేశించా’ అని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో చౌహాన్‌ మాట్లాడుతూ ఆవు ఉత్పత్తుల అమ్మకాల్లో వృద్ధి పెంచేలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గోమూత్రం నుంచి వచ్చే ఫినాయిల్‌ను ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా వాడాలని ఆదేశించారు. వాయువ్య భోపాల్‌కు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగర్‌మల్వాలో మధ్యప్రదేశ్‌ గో సంవర్ధన్‌ బోర్డు అభివృద్ధి చేసిన కామధేను గో సంరక్షణ కేంద్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, జాతీయస్థాయిలో అత్యుత్తమ గో సంరక్షణ కేంద్రమని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img