Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎట్టకేలకు కర్ణాటక స్వామీజీ అరెస్ట్‌

కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్‌ మఠం స్కూలు హాస్టల్‌ బాలికలపై మఠాధిపతి లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు రావడంతో కన్నడ నాట గత వారం రోజుల నుంచి ప్రకంపనలు రేగుతోంది.
మఠం హాస్టల్‌లోని బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిత్రదుర్గ లింగాయత్‌ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.గురువారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య శివమూర్తి మురుగాను అరెస్టు చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషీయల్‌ కస్టడీ విధించింది. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోక్సో చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించి కొన్ని గంటల పాటు శివమూర్తిని పోలీసులు ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో ఆయన అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం చిత్రదుర్గ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి విచారణ కోసం జిల్లా జైలుకు తరలించారు.మఠంలో తమపై అత్యాచారం జరిగిందని బాధిత బాలికలు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువుతున్న 15, 16 ఏళ్ల బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో మఠాధిపతి,హా స్టల్‌ వార్డెన్‌తో సహా మొత్తం ఐదుగురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. స్వామీజీని అరెస్ట్‌ చేయడానికి ముందు ఈ కేసులో హాస్టల్‌ వార్డెన్‌ రష్మీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సున్నితమైన అంశం కావడంతో చిత్రదుర్గలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, అదనపు బలగాలను రప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img