Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్యేను కొట్టిన భర్త..ఆగ్రహం వ్యక్తంచేసిన మహిళా కమిషన్‌

దేశంలో మహిళలపై గృహహింస గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది మహిళలు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల చేతుల్లోనే వేధింపులకు గురవుతున్నారని ఎన్నో సర్వేల్లోనూ తేలింది. ఆడవాళ్లు ఏ వృత్తిలో ఉన్నా.. ఎంత ఎదిగినా.. ఇంట్లో మగవాళ్ల పెత్తనాన్ని, వారి అహంకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే విషయం మరోసారి రుజువైంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌పై ఆమె భర్త దాడికి పాల్పడ్డాడు. బల్జిందర్‌ కౌర్‌ పంజాబ్‌ ఎమ్మెల్యే. బల్జిందర్‌ కౌర్‌ ఇంట్లో గొడవ జరిగింది. దేని విషయంలోనో తన భర్త ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ నేపథ్యంలో బల్జిందర్‌ కౌర్‌ను కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. దీనిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే తనను చుట్టుముట్టిన కొంతమంది వ్యక్తులతో తీవ్ర వాగ్వాదానికి దిగడం కూడా చూడవచ్చు. తర్వాత కొద్దిసేపటికి భర్త ఆమె చెంపపై కొట్టడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటన కూడా రెండు నెలల క్రితం అంటే జూలై 10న ఇది జరిగింది. తాజాగా వీడియోలు బయటికి వచ్చాయి. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
ఈ ఘటనపై పంజాబ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళలు ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అయితే దీనిపై బల్జిందర్‌ కౌర్‌ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img