Friday, April 26, 2024
Friday, April 26, 2024

తమిళనాడులో భారీ వర్షాలు.. పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక

తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి దాకా మాండూస్‌ తుపాన్‌ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగగా..తాజాగా మరోసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిరది. ఇది క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తుంది. ఈ వాయుగుండం ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని మరో 13 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. కన్యాకుమారి, తిరునల్వేరి, తూత్తుకుడిలో వర్షాలు కురుస్తున్నాయి. పాంబన్‌, తూత్తుకుడి, కుమరి పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img