Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

తమిళమూ దేవతల భాషే

మద్రాస్‌ హైకోర్టు
చెన్నై :
తమిళాన్ని దేవ భాషగా మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ మన దేశంలో సంస్కృతం మాత్రమే దేవ భాషగా గుర్తింపు పొందిందని, దానికి సమానమైన భాష మరొకటి లేదనే నమ్మకం ఏర్పడిరదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.కిరుబాకరన్‌, జస్టిస్‌ బిపుగలెండి ధర్మాసనం పేర్కొంది. కరూర్‌ జిల్లాలోని ఒక దేవాలయంలో తిరుమురాయికల్‌, తమిళ శైవ మంతిరామ్‌, ఆత్రంగరై కరురార్‌ల పారాయణాలు నిర్వహించేలా ప్రభుత్వ అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ సంస్కృత భాషకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాల ప్రకారం క్రీస్తుపూర్వం మొదటి శతాబ్ధం నాటిదిగా తెలుస్తోందని పేర్కొన్నారు. అంతకుముండు మౌఖికంగా ఉందని చెప్పబడుతున్నా దానికి రుజువులు లేవని వ్యాఖ్యానించింది. అయితే సంస్కృతంలో చాలా ప్రాచీన సాహిత్యం ఉందని, అది ప్రాచీన భాష అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపింది. సంస్కృతంలో శ్లోకాలు చదివితేనే ఆ ప్రార్థనలను దేవుడు వింటాడనే విధంగా ప్రచారం చేయడంతోనే అది దేవతల భాషగా నమ్మకం ఏర్పడిరదని పేర్కొంది. కానీ తమిళ భాష ప్రాచీనతను నిరూపించడానికి అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సంస్కృతం ఒక్కటే దేవ భాష అని చెప్పలేమని పేర్కొంది. నిజానికి ప్రజలు మాట్లాడే ప్రతి భాష దేవ భాషేనని అభిప్రాయపడిరది. పురాణాల ప్రకారం తొలి తమిళ సంఘానికి మహాశివుడే అధ్యక్షత వహించారని గుర్తు చేసింది. తమిళ కవుల జ్ఞానాన్ని పరీక్షించడానికి శివుడు ‘తిరువిలయదళం’ ఆడినట్లు ప్రజలు నమ్ముతున్నారని తెలిపింది. శివుని ఢమరుకం శబ్ధాల నుంచి తమిళం ఉద్భవించినట్టు తెలుస్తోందని పేర్కొంది. ఈ క్రమంలో తమిళాన్ని దేవుని భాషగా అభివర్ణించింది. స్థానికంగా మాట్లాడుకునే భాష అక్కడి దేవుళ్ల సేవకు వినియోగించబడుతుందని, ఆ రకంగా ప్రతి భాష దైవ భాషే అవుతుందని చెప్పింది. దేవాలయాల్లో అరుణగిరినాథర్‌, అళ్వార్లు, నయనార్లచే రూపొందించబడిన తమిళ శ్లోకాలను పారాయణ చేయవచ్చని తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img