Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దసరాకి 315 ప్రత్యేక రైళ్లు..

దసరా పండగకి ఊరేళ్లేవారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఏకంగా 315 ప్రత్యేక రైళ్లని నడుపుతున్నట్లు వెల్లడిరచింది. కొన్ని స్పెషల్‌ ట్రైన్స్‌కి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ పేర్కొన్నారు. ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయని.. ప్రయాణికులు సమయాన్ని చెక్‌ చేసుకోవాలంటూ ఆయన సూచించారు. అదేవిధంగా ప్లాట్‌ఫామ్‌ టికెట్ల ధరలు కూడా పెంచినట్లు ఆయన ధ్రువీకరించారు. ఇప్పటికే కాచిగూడ, విజయవాడలో రూ.10 ఛార్జీలను రూ. 20కు పెంచామని.. త్వరలోనే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో కూడా పెంచనున్నట్లు రాకేశ్‌ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ ఫామ్‌ టికెట్‌ ఛార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపైకి అనవసరంగా వచ్చే వారిని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img