Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశ్‌ముఖ్‌ ఈడీ కస్టడీ 15 వరకు పొడిగింపు

ముంబై : మనీలాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ కస్టడీని నవంబర్‌ 15 వరకు పొడిగిస్తూ పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత వారం ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేసింది. 71 ఏళ్ల ఎన్సీపీ నాయకుడి రిమాండ్‌ పొడిగించాలని కోరుతూ ఈడీ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన మీదట నవంబర్‌ 6న ప్రత్యేక హాలిడే కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. అయితే ఒక రోజు తర్వాత బాంబే హైకోర్టు దిగువ కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి, దేశ్‌ముఖ్‌ను నవంబర్‌ 12 వరకు ఈడీ రిమాండ్‌కు పంపింది. శుక్రవారం, మాజీ మంత్రిని ప్రత్యేక పిఎంఎల్‌ఎ కోర్టు న్యాయమూర్తి హెచ్‌ఎస్‌ సాత్‌భాయ్‌ ముందు హాజరుపరచగా, ఆయన కస్టడీని నవంబర్‌ 15 వరకు పొడిగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img